Hyderabad Jobs: మల్కాజ్‌గిరి భరోసా సెంటర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 30 వేల జీతం..
Hyderabad Jobs: హైదరాబాద్ మల్కాజ్‌గిరికి చెందిన భరోసా సెంటర్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ సంస్థ పలు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?
Hyderabad Jobs: హైదరాబాద్ మల్కాజ్‌గిరికి చెందిన భరోసా సెంటర్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ సంస్థ పలు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో లీగల్ సపోర్ట్ ఆఫీసర్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్‌ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, రిసెప్పనిస్ట్ ఖాళీలు ఉన్నాయి.
* లీగల్ సపోర్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎల్‌ఎల్‌బీ/ ఎల్‌ఎల్‌ఎంలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. కనీసం 2 ఏళ్ల అనుభవం తప్పనిసరి. వయసు 35-45 ఏళ్ల మధ్య ఉండాలి.
* మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్‌ఎం పోస్టులకు దరఖాస్తు చేసుకునే బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయసు 20-35 ఏళ్ల మధ్య ఉండాలి.
* డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి. అవయసు 20-35 ఏళ్ల మధ్య ఉండాలి.
* రిసెప్షనిస్ట్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత సరిపోతుంది. రెండేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 20-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను సైబరబాద్ కమిషనరేట్, గచ్చిబౌలిలో అందించాలి.
* ఎంపికన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 15,000 నుంచి రూ. 30,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 24-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Holi 2022: హోలీ వేడుకల్లో రంగులతో పాటు మందు.. నోటి నోటికీ లిక్కర్ సప్లై చేసిన MLA శంకర్ నాయక్