AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Recruitment 2022: తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్‌ క్లర్క్, క్యాషియర్ పోస్టులకు నోటిఫికేషన్..

AP Mahesh Bank Recruitment: తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది గుడ్ ‌న్యూస్ అని చెప్పాలి.

Bank Recruitment 2022: తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్‌ క్లర్క్, క్యాషియర్ పోస్టులకు నోటిఫికేషన్..
Ap Mahesh Bank Recruitment
Sanjay Kasula
|

Updated on: Mar 18, 2022 | 11:25 AM

Share

తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది గుడ్ ‌న్యూస్ అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్(AP Mahesh Bank Recruitment) బ్యాంకుల్లో భారీగా క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టుల భర్తీకి బ్యాంక్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు అధికారిక మెయిల్ ఐడి ద్వారా 27 మార్చి 2022లోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. విడుదలైన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, క్లర్క్ కమ్ క్యాషియర్ 200 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 16 మార్చి 2022 నుండి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ద్వారా ఈ నియామకం ఉంటుంది.  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలని కోరింది. అలాగే అభ్యర్థికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రచురించింది. అర్హత గల అభ్యర్థులు ఆంధ్ర ప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ (AP Mahesh Bank Vacancy 2022) అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 27 మార్చి 2022.

దరఖాస్తుదారుడి వయస్సు..

దరఖాస్తుదారు వయస్సు 21 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు మార్చి 31, 2022 నుంచి లెక్కించబడుతుంది.

దరఖాస్తు రుసుము..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి రూ. 500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2022: ఈ ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోండి,

దరఖాస్తు ప్రారంభ తేదీ – 16 మార్చి 2022, దరఖాస్తు చివరి తేదీ – 27 మార్చి 2022

ఎంపిక ప్రక్రియ – వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ఆదారంగా ఎంపిక చేయబడతారు.

పే స్కేల్ – ఈ ప్రభుత్వ ఉద్యోగంలో జీతం ₹ 23,934/-.

దరఖాస్తు ప్రక్రియ – ఈ ఉపాధి కోసం మీరు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.. ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి .

ఇవి కూడా చదవండి: ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్.

Health Benefits: చిటికెడు నల్ల ఉప్పుతో ఎన్నో చిక్కు సమస్యలకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా..