Hyderabad: సినిమా ఛేజింగ్‌కు ఏమాత్రం తక్కువ కాదు.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన రౌడీ షీటర్.. చివరకు
TS Crime News: నాంపల్లికి చెందిన ఫరీదుద్దీన్ ఖాద్రి అనే రౌడీషీటర్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. సినీ ఫక్కీలో పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఒకటికాదు రెండు మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో హంగామా చేశాడు.
హైదరాబాద్ గోల్కొండ(Golconda)ఏరియాలో ఓ రౌడీ షీటర్(Rowdy Sheeter)నానా హంగామా చేశాడు. పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపైకే కత్తి దూస్తూ హల్‌చల్ చేశాడు. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. మద్యం మత్తులో అలజడి సృష్టించిన రౌడీషీటర్‌ను అష్టకష్టాలు పడి పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. నాంపల్లికి చెందిన ఫరీదుద్దీన్ ఖాద్రి అనే రౌడీషీటర్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. సినీ ఫక్కీలో పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఒకటికాదు రెండు మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో హంగామా చేశాడు. ఇటీవల మల్కాజిగిరిలో దొంగతనం చేసిన ఓ కారును మద్యం మత్తులో నడుపుతుండగా బంజారాహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. ఆగకుండా వెళ్లిన అతడు ఎదురుగా వస్తున్న పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టాడు. వెంబడించిన పోలీసులకు దొరక్కుండా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని భావించిన రౌడీషీటర్ కారును వదిలేశాడు. కారు వదిలిన చోట ఉన్న ఓ యాక్టివ్‌తో పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన హకీంపేట పోలీసులు రౌడీషీటర్ కోసం వెంబడించారు. అది గమనించిన ఖాద్రి దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలోకి చొరబడ్డాడు. ఎమర్జెన్సీ వార్డులోకి దూరి తలదాచుకున్నాడు.
ఆచూకీ తెలుసుకున్న పోలీసులు ఎమర్జెన్సీవార్డుకు వెళ్లి పట్టుకునేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించిన ఖాద్రి పోలీసులపైకి కత్తిదూస్తూ వీరంగమాడాడు. అయినా వెరవని పోలీసులు అష్టకష్టాలుపడి రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో సారి తప్పించుకోకుండా కాళ్లు, చేతులు కట్టేసి మరీ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. ఇప్పటికే ఖాద్రిపై 16 కేసులు ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు.
Also Read: సాధారణ వాహన తనిఖీలు.. కంగారుగా యువకుడు.. ఎంక్వైరీ చేయగా దిమ్మతిరిగే ట్విస్ట్
ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో మాస్ హీరోగా రచ్చ చేస్తున్నాడు.. ఎవరో గుర్తించారా..?