Hyderabad: ‘సర్కారు వారి పాట’.. హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్లాన్ ఉందా.? ఇదిగో అదిరిపోయే ఆఫర్..!
నగర శివారులో ఓపెన్ ల్యాండ్స్‌ను తీసుకొని వాటిని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా డెవలప్ చేసి అమ్మకానికి పెడుతోంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ.

నగర శివారులో ఓపెన్ ల్యాండ్స్‌ను తీసుకొని వాటిని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా డెవలప్ చేసి అమ్మకానికి పెడుతోంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ. ఎటువంటి చిక్కులు లేని ఓపెన్ ప్లాట్లను మీ సొంతం చేసుకోండి అంటూ ప్రకటనలతో ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉప్పల్ భగాయత్, రాజీవ్ స్వగృహ ఫ్లాట్లతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ల్యాండ్ పార్శిల్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా వేలం వేసిన హెచ్ఎండీఏ. అదే జోష్‌తో మరిన్ని ప్లాట్ల విక్రయానికి రెడీ అయింది.
కోకాపేట్‌లో కోట్లు కురిపించిన భూముల వేలం ఎవరూ మరిచిపోలేదు. కోకాపేట్‌లో మిగిలిన భూముల అమ్మేందుకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. నియోపోలిస్ ఫేజ్-2 పేరుతో 45 ఎకరాల్లోని 7 ప్లాట్ల భారీ వేలానికి డేట్ ఫిక్స్ చేసింది. కోకాపేట్ ల్యాండ్ సొంతం చేసుకునేందుకు ఆఖరి అవకాశం అంటూ ప్రకటనలతో ప్రచారం చేస్తోంది. ఈ జులై 20న ప్రీ బిడ్డింగ్ మీటింగ్ ఉండగా.. జులై 31 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఆగస్టు 1 వరకు ధరావతు చెల్లించాలి. ఆగస్టు 3న ఆన్ లైన్ లో వేలం పాట నిర్వహించనున్నారు. ఎకరాకు నిర్దేశిత కనీస ధరను 35 కోట్లుగా నిర్ణయించారు. వేలంలో పాల్గొనే వారు ఎకరాకు 25 లక్షల చొప్పున పెంచుకుంటూ వేలం పాట పాడాల్సి ఉంటుంది. ఈ ఖరీదైన ల్యాండ్స్‌ను పెద్ద పెద్ద రియాల్టర్లు, ఏజెన్సీలు, సంస్థలు దక్కించుకునేందు భారీగా పోటీ పడనున్నాయి. ధరావతు ప్రతి ప్లాటుకు 5 కోట్ల రూపాయలు చెల్లించాలి. దాదాపు 1600 నుంచి 2500 కోట్ల రూపాయల భారీ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కోకాపేట్ అంతా కోట్లు ఉన్నవారి కోసం అయితే మధ్యతరగతి వారికోసం మరికొన్ని చోట్ల ప్లాట్లను అమ్మేందుకు హెచ్ఎండీ రెడీ అయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇన్వెస్ట్ మెంట్ చేసేలా మిడిల్ క్లాస్ వాళ్లు సైతం పాల్గొనేలా ల్యాండ్స్ ను సేల్ చేసింది. ఇప్పుడు బోడుప్పుల్, మోకిల ప్రాంతాల్లో 100 ప్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ సిద్దమైంది. బ్యూటిఫుల్ లైప్ ఎట్ బోడుప్పల్ సరౌండెడ్ బై నేచర్ అంటూ బోడుప్పల్ సమీపంలో ఫేజ్-1 లో 50 ప్లాట్లను డెవలప్ చేసి వేలం వేయబోతుంది. 266, 300 చదరపు గజాల్లో రెసిడెన్షియల్ ప్లాట్లను రెడీ చేశారు. ప్రైవేట్ వెంచర్లకు తీసిపోకుండా అన్ని సౌకర్యాల డెవలప్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. లక్ష రూపాయల ధరావతు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈ ప్లాట్ల ఆన్ లైన్ వేలంలో పాల్గొనొచ్చు. ఇక్కడ చదరపు గజానికి కనీస నిర్దేశిత ధర 25 వేలుగా నిర్ణయించారు. 500 రూపాయల చొప్పున పెంచుకుంటూ వేలం పాట పాడవచ్చు. జులై 25 లే అవుట్ లో ప్రి బడ్డింగ్ మీటింగ్ జరగబోతుంది. అక్కడ సందేహాలకు సమాధానాలు ఇస్తారు.
- రిజిస్ట్రేషన్ చివరి తేది: 07.08.2023
- దరావతు చెల్లింపు చివరి తేది: 07.08.2023
- రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 1180
- ధరావతు రుసుం: రూ.1,00,00 per plot
- ఆన్ లైన్ వేలం తేది: 09.08.2023
బ్యూటిఫుల్ లైప్ ఎట్ మోకిల:
నగరంలో నుంచి శంకర్‌పల్లి వెళ్లే రూట్‌లో మోకిల ఫేజ్ -1 పేరుతో వేలానికి 50 ప్లాట్లను హెచ్ఎండీఏ డెవలప్ చేసింది. ఇక్కడ 300 నుంచి 400 చదరపు గజాల్లో రెసిడెన్షియల్ ప్లాట్లను సిద్ధం చేశారు. ఎన్ని అంతస్థుల వరకు బిల్డింగ్ నిర్మించుకోవచ్చు..? 111 జీవో ఎత్తివేతతో ఈ ప్రాంతం మరింత డెవల్ కానున్న నేపథ్యంలో భారీ గిరాకీ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అదే నిజమైతే సర్కారు వారి ఖజానా కాసులతో గలగల లాడనుంది.
- రిజిస్ట్రేషన్ చివరి తేది: 04.08.2023
- దరావతు చెల్లింపు చివరి తేది: 05.08.2023
- రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 1,180
- ధరావతు రుసుం: రూ.1,00,00 per plot
- ఆన్ లైన్ వేలం తేది: 07.08.2023
- ప్రీ బిడ్డింగ్ మీటింగ్: 21.07.2023
- కనీస నిర్దేశిత ధర: రూ. 25,000/- per Sq. Yard
షాబాద్‌లో ల్యాండ్ షేర్:
షాబాద్‌లో మరో 50 రెసిడెన్షియల్ ప్లాట్లను అమ్మేందుకు హెచ్ఎండీఏ రెడీ అయింది. నగరానికి నలు దిక్కుల ప్లాట్లను డెవలప్ చేసి శివారులకు నగరాన్ని విస్తరిస్తోంది. ల్యాండ్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రభుత్వ సంస్థ ఏకంగా రియల్ ఎస్టేట్ లో ఇలా ప్లాట్లను వేలానికి పెడుతోంది.
- రిజిస్ట్రేషన్ చివరి తేది: 04.08.2023
- దరావతు చెల్లింపు చివరి తేది: 05.08.2023
- రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 1,180
- ధరావతు రుసుం: రూ.1,00,00 per plot
- ఆన్ లైన్ వేలం తేది: 08.08.2023
- ప్రీ బిడ్డింగ్ మీటింగ్: 22.07.2023
- కనీస నిర్దేశిత ధర: రూ. 10,000/- per Sq. Yard
స్వయంగా హెచ్ఎండీఏ నే డెవలప్ చేసి ప్లాట్లను విక్రయిస్తుండటంతో ఎలాంటి వివాదాలకు తావు ఉండదని.. తాము కొనుగోలు చేసిన ప్లాట్లు లీగల్‌గా సేఫ్ అనే భావనలో కొనుగోలుదారులు ఉన్నారు. ఆగస్టు నెలలో హెచ్ఎండీఏ వేలం జోరు సాగనుంది. ఎలాంటి సందేహాలు ఉన్నా.. హెచ్ఎండీఏ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. అదే భరోసా ఇస్తూ హెచ్ఎండీఏ ఆన్ లైన్ వేలం విజయవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. హెచ్ఎండీఏ వేలం పాటకు మంచి డిమాండ్ ఉండటంతో ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురుస్తోంది.
