ప్రజాసమస్యల పరిష్కారంలో టాప్.. జీహెచ్‌ఎంసీ ట్విట్టర్‌కు లక్షమంది ఫాలోవర్లు..!

జీహెచ్‌ఎంసీ అధికారికంగా నిర్వహిస్తోన్న ట్విట్టర్‌ను అత్యధిక మంది ఫాలో చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు లక్షమందికి పైగా జీహెచ్‌ఎంసీ ట్విట్టర్‌ను ఫాలో అవుతున్నారట. అలాగే.. ట్విట్టర్‌కు పలు ఫిర్యాదులు కూడా వచ్చినట్టు కమిషనర్ దాన కిషోర్‌ తెలిపారు. సమస్యలపై సంబంధించిన అధికారులతో సంప్రదించి తక్షణమే స్పందిస్తున్నందున ఎక్కువగా ఈ ట్విట్టర్‌ను ఫాలో అవుతున్నట్టు ఆయన తెలిపారు. దేశంలోనే ఏ మున్సిపల్ కార్పొరేషన్‌కీ ఇంతమంది ఫాలోవర్లు లేరని చెప్పారు. దేశంలో స్వచ్ఛ నగరంగా ఉన్న సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌ […]

ప్రజాసమస్యల పరిష్కారంలో టాప్.. జీహెచ్‌ఎంసీ ట్విట్టర్‌కు లక్షమంది ఫాలోవర్లు..!
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 3:52 PM

జీహెచ్‌ఎంసీ అధికారికంగా నిర్వహిస్తోన్న ట్విట్టర్‌ను అత్యధిక మంది ఫాలో చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు లక్షమందికి పైగా జీహెచ్‌ఎంసీ ట్విట్టర్‌ను ఫాలో అవుతున్నారట. అలాగే.. ట్విట్టర్‌కు పలు ఫిర్యాదులు కూడా వచ్చినట్టు కమిషనర్ దాన కిషోర్‌ తెలిపారు. సమస్యలపై సంబంధించిన అధికారులతో సంప్రదించి తక్షణమే స్పందిస్తున్నందున ఎక్కువగా ఈ ట్విట్టర్‌ను ఫాలో అవుతున్నట్టు ఆయన తెలిపారు. దేశంలోనే ఏ మున్సిపల్ కార్పొరేషన్‌కీ ఇంతమంది ఫాలోవర్లు లేరని చెప్పారు. దేశంలో స్వచ్ఛ నగరంగా ఉన్న సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌ ట్విట్టర్‌కు కేవలం 4,100 మంది మాత్రమే ఫాలోవర్లు ఉన్నారన్నారు. అలాగే.. బెంగళూరు కార్పొరేషన్ అధికారిక ట్విట్టర్‌కు 26,800మంది ఫాలోవర్లు, పూణే మున్సిపల్ కార్పొరేషన్‌‌కు 21,800, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 40 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారని కమిషనర్ దాన కిషోర్ చెప్పారు.

Latest Articles