బ్రేకింగ్: హైదరాబాద్ మెట్రోకు తప్పిన ప్రమాదం!

హైదరాబాద్ మెట్రోకు పెను ప్రమాదం తప్పింది.  మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్తున్న ట్రైన్.. లక్డీకాపూల్ స్టేషన్ వద్ద.. ట్రాక్ మారి.. పొరపాటున మరో ట్రాక్‌లో పయనమైంది. అయితే ఈ పొరపాటును వెంటనే గమనించిన డ్రైవర్… లక్డీకాపూల్‌లో ప్రయాణికులను దించేశాడు. ఆ తర్వాత ఆ ట్రైన్ తిరిగి మియాపూర్ వెళ్ళింది. ఇక ఈ ఘటన సమయంలో రైలులో 400 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ కూడా ఇది తెలుసుకుని ఒక్కసారిగా షాక్ కాగా.. ఆ ట్రాక్‌లో వేరే ట్రైన్ […]

బ్రేకింగ్: హైదరాబాద్ మెట్రోకు తప్పిన ప్రమాదం!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 27, 2019 | 4:46 PM

హైదరాబాద్ మెట్రోకు పెను ప్రమాదం తప్పింది.  మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్తున్న ట్రైన్.. లక్డీకాపూల్ స్టేషన్ వద్ద.. ట్రాక్ మారి.. పొరపాటున మరో ట్రాక్‌లో పయనమైంది. అయితే ఈ పొరపాటును వెంటనే గమనించిన డ్రైవర్… లక్డీకాపూల్‌లో ప్రయాణికులను దించేశాడు. ఆ తర్వాత ఆ ట్రైన్ తిరిగి మియాపూర్ వెళ్ళింది. ఇక ఈ ఘటన సమయంలో రైలులో 400 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ కూడా ఇది తెలుసుకుని ఒక్కసారిగా షాక్ కాగా.. ఆ ట్రాక్‌లో వేరే ట్రైన్ ఎదురుగా వస్తే.. ఏమి జరిగేదో అని తలుచుకుని భయపడుతున్నారు. అయితే ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కొద్ది రోజుల క్రిందట లక్డీకాపూల్ స్టేషన్ వద్ద మెట్రో రైల్ ఆగిపోయిన సంగతి తెలిసిందే.

రాంగ్ రూట్ వార్తలు అవాస్తవం: మెట్రో ఎండీ

మెట్రో రైలు లక్డీకాపూల్ వద్ద ట్రాక్ మారిందంటూ వస్తున్న వార్తలపై మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. మెట్రో రైలుకు ప్రమాదం ఏమి జరగలేదని.. రాంగ్ రూట్ అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. వాస్తవాలు తెలియకుండా పుకార్లు వ్యాపించవద్దని కోరారు. మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ గాలి ధాటికి అసెంబ్లీ స్టేషన్ వద్ద ట్రాక్‌పై మెరుపు అరెస్టర్ రాడ్ పడింది. అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా, ఓవర్ హెడ్ ఎలెక్ట్రికల్ పవర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. అలాగే పడిపోయిన రాడ్‌ను తొలగించాం. రైలుకు ఓహెచ్‌ఈ (OHE) శక్తి లేకపోవడంతో.. మరమ్మతు పనుల కోసమే అరగంట పాటు రైలును నిలిపివేయాల్సి వచ్చిందని ఎండీ వివరించారు.