AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: టెన్త్ చదివి డాక్టర్ అవతారం.. జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతోన్న నకిలీ వైద్యుడు అరెస్ట్!

విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్‌లోని నార్త్‌జోన్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఓ నకిలీ వైద్యుడిని అరెస్ట్ చేసింది. తుకారాంగేట్‌తో పాటు హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి పరిధిలోని తుకారాంగేట్‌లోని మీనా హాస్పిటల్ పక్కన గీతా క్లినిక్ పేరు తో పైల్స్/ఫిస్టులా/ఫిషర్ ట్రీట్‌మెంట్ నిర్వహిస్తున్న 30 ఏళ్ళ తుహిన్ కుమార్ మండల్ అనే నకిలీ వైద్యున్ని పట్టుకున్నారు. ఏకంగా గీతా క్లినిక్‌ పేరిట చిన్నా హాస్పిటల్ సెటప్ చేసి డాక్టర్ టి.కె.మండల్ పేరుతో విజిటింగ్..

Hyderabad: టెన్త్ చదివి డాక్టర్ అవతారం.. జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతోన్న నకిలీ వైద్యుడు అరెస్ట్!
Fake Doctor
Sravan Kumar B
| Edited By: Srilakshmi C|

Updated on: Sep 24, 2023 | 2:16 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్ 24: విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్‌లోని నార్త్‌జోన్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఓ నకిలీ వైద్యుడిని అరెస్ట్ చేసింది. తుకారాంగేట్‌తో పాటు హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి పరిధిలోని తుకారాంగేట్‌లోని మీనా హాస్పిటల్ పక్కన గీతా క్లినిక్ పేరు తో పైల్స్/ఫిస్టులా/ఫిషర్ ట్రీట్‌మెంట్ నిర్వహిస్తున్న 30 ఏళ్ళ తుహిన్ కుమార్ మండల్ అనే నకిలీ వైద్యున్ని పట్టుకున్నారు. ఏకంగా గీతా క్లినిక్‌ పేరిట చిన్నా హాస్పిటల్ సెటప్ చేసి డాక్టర్ టి.కె.మండల్ పేరుతో విజిటింగ్ కార్డ్‌లు కూడా కొట్టించాడు నకిలీ డాక్టర్. పోలీస్ లు రైడ్ చేసి అతని క్లినిక్ నుంచి ఆయింట్‌మెంట్స్, ట్యాబ్లెట్‌లు, పైల్స్ ట్రీట్‌మెంట్ సాధనాలు స్వాధీనం చేసుకున్నారు.

తుహిన్ కుమార్ చదివింది 10వ తరగతి అని తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏ అర్హతతోని వైద్యం చేస్తున్నావని అడగ్గా ఓ డాక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసినానని అన్నీ తెలుసని సమర్థించుకున్నాడు. 2012లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లికి వెళ్లి డాక్టర్ బిశ్వాస్ వద్ద సహాయకుడిగా చేరారు, అక్కడ పైల్స్ చికిత్స నేర్చుకున్నారు. 2016లో హైదరాబాద్‌కు వచ్చి ‘గీతా క్లినిక్‌’ పేరుతో పైల్స్‌ ట్రీట్‌మెంట్‌ క్లినిక్‌ని ప్రారంభించి పైల్స్‌, ఫిస్టులా, ఫిషర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ టి.కె.మండల్‌గా పేషెంట్లకు ఫోజులిస్తూ తాను చికిత్స చేస్తే ఎలాంటి జబ్బు ఉంటుందని భరోసా ఇచ్చారు. రోగం మళ్ళీ తిరగబడకుండా ట్రీట్మెంట్ చేయటం తన స్పెషాలిటీ అంటూ పబ్లిసిటీ చేసుకున్నాడు. వాస్తవానికి, రోగులకు చికిత్స చేయడానికి అతని వద్ద క్వాలిఫైడ్ సర్టిఫికేట్ లేదు. ఇలా రోగులను మోసం చేస్తున్నాడు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కే సైదులు దాడి చేసి ఈ నకిలీ డాక్టర్ భరతం పట్టించారు.

ఫిస్టులా పైల్స్ వంటి సమస్యలతో బాధపడేవారు తమ సమస్యలను ఇతరులతో చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ వీటికి సరైన వైద్యం ఎక్కడ అందుతుందో సరైన అవగాహన లేకపోవడం ఇలాంటి నకిలీ వైద్యులకు అవకాశం గా మారుతుంది పోస్టర్లు పాంప్లేట్లతో ప్రచారం చేస్తూ గల్లీలో చిన్న చిన్న షట్టర్లలో తక్కువ ఖర్చుతోనే వైద్యం చేస్తుండటంతో వీరి వైపు కి ఆకర్షితులవుతున్నారు అమాయకులు.ఇటువంటి జబ్బులకి వైద్యం చేసే నకిలీ వైద్యులు చాలామంది ఉన్నారని వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.