Telangana: నిజాం కాలేజీ డిగ్రీ విద్యార్థినులకు ఊరట.. మంత్రితో ఫలించిన చర్చలు.. సర్కులర్ జారీ చేసిన ప్రిన్సిపాల్..
హైదరాబాద్ నిజాం కాలేజీలో గత 15 రోజులుగా విద్యార్థినులు ఆందోళ చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం చర్చలు జరిపినా విద్యార్థినులు మాత్రం ఆందోళనలను విరమించలేదు. తమకు హాస్టల్ భవనాన్ని కేటాయించాలని నిజాం కాలేజీకి చెందిన డిగ్రీ విద్యార్థినులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు...
హైదరాబాద్ నిజాం కాలేజీలో గత 15 రోజులుగా విద్యార్థినులు ఆందోళ చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం చర్చలు జరిపినా విద్యార్థినులు మాత్రం ఆందోళనలను విరమించలేదు. తమకు హాస్టల్ భవనాన్ని కేటాయించాలని నిజాం కాలేజీకి చెందిన డిగ్రీ విద్యార్థినులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో తాజాగా మంగళవారం తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మరోసారి విద్యార్థినులతో చర్చలు జరిపారు. తాజాగా చర్చలు ఫలించాయి.
హాస్టల్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరీకి హాస్టల్ కేటాయించాలని అధఙకారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే యూజి 2, 3 విద్యార్థులు హాస్టల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సర్కులర్ జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో అమ్మాయిలకు హాస్టల్ వసతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త భవనంలో యూజి విద్యార్థులకు హాస్టల్ గదులు కేటాయించిన తర్వాత మిగిలితే పీజీ వాళ్లకు కేటాయించనున్నారు. విద్యార్థినులను హాస్టల్ కోసం 19-11-2022లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే హాస్టల్ కోసం డిగ్రీ విద్యార్థినులు ఆందోళన నేపథ్యంలో గతంలో యాభై శాతం పీజీ విద్యార్థులకు, యాభై శాతం డిగ్రీ విద్యార్థులకు భవనాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి డిగ్రీ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్పారు. వంద శాతం హాస్టల్ తమకే కావాలని విద్యార్థినులు డిమాండ్ చేసిన నేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి ఈ సమస్యకు ఒక ఫుల్‌స్టాప్ పెట్టారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..