Viral Photo: ఎలా ఉండేవాడు ఎలా అయ్యాడు.. ఈ నూనుగు మీసాల కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? ఏం డెడికేషన్ గురూ..
ఇటీవలి కాలంలో బాడీ ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. లావుగా ఉన్న వారు సన్నబడుతున్నారు. అయితే ఆరోగ్య వంతమైన జీవితం కోసం సన్నబడాలనుకునే వారి మెజారిటీ ఉంటారు. అలా కాకుండా తమపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్‌కి రియాక్షన్‌గా బరువు తగ్గి చూపిస్తే...
ఇటీవలి కాలంలో బాడీ ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. లావుగా ఉన్న వారు సన్నబడుతున్నారు. అయితే ఆరోగ్య వంతమైన జీవితం కోసం సన్నబడాలనుకునే వారి మెజారిటీ ఉంటారు. అలా కాకుండా తమపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్‌కి రియాక్షన్‌గా బరువు తగ్గి చూపిస్తే. పైన ఫొటోలో కనిపిస్తోన్న కుర్రాడు బహుశా ఇలానే అనుకున్నట్టున్నాడు. మొన్నటి వరకు బొద్దుగా ఉన్న ఈ కుర్రాడు ఈ స్లిమ్‌గా మారి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరో మీరు గుర్తుపట్టారా.?
అవును మీరు అనుకుంటోంది నిజమే. చూడడానికి అచ్చంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లా కనిపిస్తోన్న ఈ కుర్రాడు మరెవరో కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షునే. గత కొన్ని రోజుల క్రితం హిమాన్షును టార్గెట్ చేస్తూ కొందరు రాజకీయ నాయకులు బాడీ షేమింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాజకీయాలకు అతీతంగా కొందరు నేతలు హిమాన్షుకు మద్ధతు కూడా ప్రకటించారు. రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను, మరీ ముఖ్యంగా చిన్న పిల్లలను లాగకూడదంటూ స్పందించారు. అయితే ఈ విషయాన్ని హిమాన్షు సీరియస్‌గా తీసుకున్నట్టున్నాడు అందుకే డెడికేషన్‌తో వర్కవుట్స్ చేసి పూర్తిగా సన్నబడ్డాడు.
ఈ క్రమంలోనే తాజాగా హిమాన్షుకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కోట్, టై వేసుకొని ఉంగరాల జుట్టుతో పూర్తిగా డిఫ్రంట్ లుక్‌లోకి మారిపోయాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లావుగా ఉన్న హిమాన్షు ఇంత స్లిమ్‌గా మారడాఅంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటో చూస్తుంటే నిజంగానే హిమాన్షు డెడికేషన్ సూపర్ అనిపిస్తోంది కదూ.
View this post on Instagram
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..