Jagtial: వీళ్లు మనుషులేనా.. లవ్ మ్యారేజ్ చేసుకుందని.. కుమార్తెను ఏం చేశారంటే..

పిల్లలపై తల్లిదండ్రలకు ఉండే ప్రేమ ఎంతటి పని చేసేందుకైనా వెనకాడదు. వారు కోరింది ఇచ్చే పేరెంట్స్.. ప్రేమిస్తున్నానంటే మాత్రం ఒప్పుకోవడం లేదు. కోపంతో రగలిపోతున్నారు. కాదని వెళ్లిపోతే కక్ష పెంచుకుంటున్నారు....

Jagtial: వీళ్లు మనుషులేనా.. లవ్ మ్యారేజ్ చేసుకుందని.. కుమార్తెను ఏం చేశారంటే..
Harassment
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 15, 2022 | 1:51 PM

పిల్లలపై తల్లిదండ్రలకు ఉండే ప్రేమ ఎంతటి పని చేసేందుకైనా వెనకాడదు. వారు కోరింది ఇచ్చే పేరెంట్స్.. ప్రేమిస్తున్నానంటే మాత్రం ఒప్పుకోవడం లేదు. కోపంతో రగలిపోతున్నారు. కాదని వెళ్లిపోతే కక్ష పెంచుకుంటున్నారు. కొందరు వారి మానాన వారే పోతారని వదిలేస్తుంటే మరి కొందరు మాత్రం దారుణంగా ప్రవర్తిస్తున్నారు. దాడి చేయడం, హత్య చేసేందుకు కూడా వెనకాడటం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా జగిత్యాల జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయి సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్న కూతురి పట్ల ఆమె బంధువులు దారుణానికి పాల్పడ్డారు. యువతిని ఆమె భర్త నుంచి లాక్కొచ్చి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా గుండు కొట్టించారు. జగిత్యాల జిల్లా గ్రామీణ మండలంలోని బాలపల్లి గ్రామానికి యువకుడు, రాయికల్‌ మండలం ఇటిక్యాలకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. ఈ విషయం యువతి ఇంట్లో వాళ్లకు తెలిసింది. వారి పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు.

పెద్దలు తమ పెళ్లిని అంగీకరించని భావించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. అనంతరం యువకుడి ఇంటికి వెళ్లారు. నూతన జంట యువకుడి ఇంట్లోనే నివాసముంటోంది. విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు ఆదివారం సాయంత్రం రెండు కార్లలో వచ్చారు. అతని కుటుంబంపై దాడిచేసి యువతిని తీసుకెళ్లిపోయారు. బలవంతంగా కారులో ఎక్కించారు. దారి పొడవునా తీవ్రంగా కొట్టారు. వద్దని, వదిలిపెట్టాలని వేడుకున్నా వారు కనికరించలేదు. వదలకుండా శిరోముండనం చేశారు.

వారి బారి నుంచి తప్పించుకున్న యువతి.. సోమవారం జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. తనకు జరిగిన ఘాతుకాన్ని పోలీసులకు వివరించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్సై బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెను భర్తకు అప్పగించారు. బాధ్యులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?