Pawan Death: సనత్‌ నగర్‌ పవన్ సూసైడ్‌ కేసులో వెలుగులోకి కొత్త కోణాలు

హైదరాబాద్ సనత్‌ నగర్‌ నివాసి అయిన పవన్ సూసైడ్‌ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటిదాకా వ్యక్తిగత కారణాలతో పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని భావించారంతా. కానీ..

Pawan Death:  సనత్‌ నగర్‌ పవన్ సూసైడ్‌ కేసులో వెలుగులోకి కొత్త కోణాలు
Pawan Wife Priyanka
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 13, 2021 | 2:30 PM

Priyanka Husband Pawan Suicide case: హైదరాబాద్ సనత్‌ నగర్‌ నివాసి అయిన పవన్ సూసైడ్‌ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటిదాకా వ్యక్తిగత కారణాలతో పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని భావించారంతా. కానీ ఇవాళ మాత్రం భార్య ప్రియాంక టార్చరే కారణమని ఆరోపించారు పవన్ కుటుంబసభ్యులు. అంతేకాదు సూసైడ్ కేసులో సెక్షన్లు మార్చాలన్నారు. సెక్షన్ 174 బదులుగా 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలన్నారు. ఇంతకీ ఏది నిజం..? పవన్‌ సూసైడ్ చేసుకునేంతలా ప్రియాంక వేధించిందా? ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్యలో చనిపోయేంత మనస్పర్థలు ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నలే ఇప్పుడు మిస్టరీగా మారాయి.

2015 లో పవన్‌ – ప్రియాంకలకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు, మనసులు కలిశాయి. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. జంట చూడముచ్చటగా ఉందని మురిసిపోయారంతా. కానీ ఈ మధ్యకాలంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. అప్పటినుంచి వీళ్ల కాపురంలో కలహాలు మొదలయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రియాంకకు టిక్‌టాక్‌ వీడియోస్ చేస్తూ.. ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం హాబీ. ఇందులో పవన్‌కి ఎలాంటి అభ్యంతరాల్లేవ్‌. పైగా ఇద్దరూ కలిసి వీడియోలు చేసిన సందర్భాలున్నాయి. ఏదో సరదాకు వీడియోలు చేస్తే ఫర్వాలేదు కానీ ఏదో ఒకరోజు తాను స్టార్‌ అవుతానని అనేదట ప్రియాంక. పవన్‌ మాత్రం ముందు కెరీర్‌, ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేవాడట.

ఈ క్రమంలోనే కోవిడ్ కారణంగా పవన్‌ కాంట్రాక్ట్ ఉద్యోగం పోవడంతో కొత్త జాబ్‌ వెదుక్కునే పనిలో పడ్డాడు. అయితే ప్రియాంక తనకు సహకరించకుండా వీడియోస్‌ చేయడంపై పవన్ మనస్థాపానికి గురయ్యాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

వీడియోస్ వద్దని పవన్ వారించడంతో గొడవలు మొదలయ్యాయి. ప్రియాంక తీరు నచ్చక మౌలాలీలోని అత్తారింట్లో ఆమెను వదిలేసి వచ్చాడు. తెల్లారేసరికి పవన్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ను బట్టి ఆత్మహత్య అని నిర్దారించారు పోలీసులు. కానీ సూసైడ్‌ వెనుక ప్రియాంక వేధింపులే కారణమన్నది పవన్ కుటుంబం ఆరోపణ.

చెట్టంత కొడుకు ఇకలేడని తెలిసి పవన్ తల్లి టీవీ9 ముందు ఇవాళ కన్నీరుమున్నీరయింది. కోడలు వైఖరి కారణంగానే తన బిడ్డ చనిపోయాడని ఆమె ఆరోపించారు. అయితే, ప్రియాంక మాత్రం తమ మధ్య మనస్పర్దలు తప్ప ప్రాణాలు తీసుకునేంత పెద్ద గోడవల్లేవన్నారు. పవనే తమ బిడ్డను టార్చర్ పెట్టాడని ప్రియాంక తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు.

ఆస్తుల గొడవల కారణంగానే సూసైడ్‌ చేసుకున్నాడని చెబుతున్నారు. ఇంతకీ ఎవరి వాదనలో నిజముంది? పవన్‌ సూసైడ్‌కి భార్య వేధింపులే కారణమా? ఆవేశంలో పవన్ అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడా? దంపతులిద్దరూ ఫోన్‌లో ఏం మాట్లాడుకున్నారు.. ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్‌ ఏంటి? ఈ వివరాలు బయటకు వస్తే పవన్‌ సూసైడ్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Read also: Buggana: బిల్లులు లేకుండా చెల్లించారన్నది అవాస్తవం, రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలున్నాయి : ఆర్థిక మంత్రి