Buggana: బిల్లులు లేకుండా చెల్లించారన్నది అవాస్తవం, రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలున్నాయి : ఆర్థిక మంత్రి
41 వేల కోట్ల రూపాయలకు బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది పూర్తిగా అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు...
Andhra pradesh Finance Minister Buggana Rajendranath Reddy: 41 వేల కోట్ల రూపాయలకు బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది పూర్తిగా అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని ఆయన పూర్తిగా ఖండించారు. టీడీపీ నేత, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపణలు అర్ధరహితమని బుగ్గన మండిపడ్డారు. ఇవాళ తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ సెంట్రల్ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర అనుమనాలు రేకెత్తిస్తున్నారన్నారని ఆయన ఏపీలోని విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడిట్ చేసినప్పుడు పలురకాల ప్రశ్నలు వేస్తారని.. ఆడిట్ సంస్థ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదని ఆయన వివరణ ఇచ్చారు.
సందేహాలు ఉంటే మీటింగ్ పెట్టి పరిష్కరించుకోవచ్చని.. లేఖలు రాయటం వల్ల ప్రయోజనం ఏంటో అర్థం కావట్లేదన్నారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవమని మంత్రి తెలిపారు. రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయని.. ప్రతిపక్షం నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి బుగ్గన ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి సూచించారు.
Read also: Chandrababu: ‘2004 కంటే ముందు మీ ఆస్థి ఎంత… ఇప్పుడెంత..? ధర్మం, న్యాయం కోసం పోరాడుతున్నాం’