Chandrababu: ‘2004 కంటే ముందు మీ ఆస్థి ఎంత… ఇప్పుడెంత..? ధర్మం, న్యాయం కోసం పోరాడుతున్నాం’

నరేంద్రది రాజకీయ చరిత్ర గల కుటుంబమని, ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు..

Chandrababu: '2004 కంటే ముందు మీ ఆస్థి ఎంత... ఇప్పుడెంత..? ధర్మం, న్యాయం కోసం పోరాడుతున్నాం'
Chadnrababu
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 13, 2021 | 1:54 PM

Chandrababu – Dhulipalla Narendra: నరేంద్రది రాజకీయ చరిత్ర గల కుటుంబమని, ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర ఒక్కసారి మాత్రమే ఓటమి పాలయ్యారని అలాంటి వ్యక్తి మీద రాజకీయ కక్షలతో అరెస్టు చేయడం అమానుషం, దుర్మార్గం అని చంద్రబాబు ఆరోపించారు. విలువలు లేని రాజకీయాలు చేస్తే రాష్ట్రం తగులపడుతుందని చెప్పుకొచ్చిన చంద్రబాబు, 2004 కంటే ముందు మీ ఆస్థి ఎంత… ఇప్పుడెంత..? అని ప్రశ్నించారు. ధర్మం, న్యాయం కోసం పోరాడుతున్నామని చంద్రబాబు అన్నారు.

కంపెనీ యాక్ట్ కు చట్ట ప్రకారమే మార్పు జరిగిందని సంఘం డైరీ గురించి చెప్పుకొచ్చిన చంద్రబాబు, ఆసుపత్రి పెట్టి నరేంద్ర రైతులకు సేవ చేస్తున్నారని వెల్లడించారు. “పోలీసులు ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపుకు ఇష్టానుసారం వ్యవరిస్తున్నారు. అచ్చెన్నాయుడు, జనార్థన రెడ్డిని అరెస్ట్ చేశారు. సాక్ష్యం చూపించి అరెస్ట్ చేస్తే మేము మద్దతిస్తాం. నరేంద్రపై ముప్పై రోజుల పాటు అరాచకం చేశారు.” అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

ఇవాళ గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి వెళ్లిన టీడీపీ అధినేత.. ఇటీవల అరెస్ట్ అయిన సంగం డెయిరీ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించారు. ఈ సందర్భంగా బుడంపాడు జాతీయ రహదారి వద్ద టీడీపీ ఇన్ చార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో చంద్రబాబుకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం గుంటూరు వెళ్లిన చంద్రబాబు.. ఇటీవల మరణించిన మైనారిటీ నేత హిదాయత్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Read also: Polavaram Project: పోలవరం సాకారం దిశగా ‘మేఘా’ వేగంతో పనులు