Netaji Jayanti: ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు.. ప్రముఖులకు జన్ ఉర్జా మంచ్ అవార్డుల ప్రధానం

స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126 వ జయంతి ఉత్సవాలను జన్ ఉర్జా మంచ్ అనే స్వచ్ఛంద సంస్ధ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ బిర్లా ప్లానింతోరియంలో..

Netaji Jayanti: ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు.. ప్రముఖులకు జన్ ఉర్జా మంచ్ అవార్డుల ప్రధానం
Netaji Subhas Chandra Bose 126th Birth Anniversary
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 23, 2022 | 2:39 PM

Netaji Subhas Chandra Bose Jayanti: నేటి సమాజంలో యువతకు స్వీయ నియంత్రణ, దేశ భక్తి ఎంతైనా అవసరమని శ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జియ్యర్ స్వామి అన్నారు. ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుందని అందుకు అందరూ అర్హులే అని ఆయన తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయన్ని కాపాడుకోవాలని అందుకు అందరూ కృషి చేయాలని శ్రీశ్రీ త్రిదండి చిన జియ్యర్ స్వామీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126 వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేతాజీ జయంతి ఉత్సవాలను జన్ ఉర్జా మంచ్ అనే స్వచ్ఛంద సంస్ధ ఘనంగా నిర్వహించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల్లో శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ.. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి అవార్డుల ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జియ్యర్ స్వామీ తో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన జియ్యర్ స్వామి మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ కు నేతాజీ అనే బిరుదు విదేశాలు ఇచ్చాయన్నారు. సుఖం కావాలంటే కష్ట పడాలని గులాబీ పువ్వు అందం, సువాసన కావాలంటే దాని క్రింద ఉన్న ముల్లు ల భాదను ఓర్చుకోవాలని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయలను కాపాడుకోవాలని అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన జయ్యర్ స్వామి పిలుపునిచ్చారు. శ్రీశ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను ఫిబ్రవరిలో 2 నుంచి ప్రారంభం కానున్నదని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ముచ్చింతల్ లో ఫిబ్రవరిలో జరగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమం దేశానికే వన్నె తెస్తుందని అన్నారు. “మీ రక్తం నాకు ఇవ్వండి… నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను”అంటూ నాడు సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన నినాదాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్‌ను సూపర్ పవర్‌గా నిలపడం నేతాజీ లక్ష్యమని అన్నారు. అదే బాటలో మన భారత ప్రధాని మోడీ సైతం పయనిస్తున్నారన్నారు.. భారత్‌‌ను “ఆత్మ నిర్భర్‌ భారత్”గా మార్చడం ద్వారా.. మన దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. దేశ భక్తి, సంస్కృతి, సేవ లాంటివి ప్రతి ఒక్కరిలో ఉండాలని..  మనం నేతాజీకి ఇచ్చే నిజమైన నివాళి ఇదేనంటూ దత్తాత్రేయ పేర్కొన్నారు.

అనంతరం తెలంగాణ రాష్ట్రం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అవిక్షరించనున్నదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ముచ్చింతల్ లో జరగబోయే రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలో ఆ పోరాటాలకు చిహ్నంగా.. గొప్ప పేరు తెచ్చే కట్టడాలను ఈ రోజు తెలంగాణలో నిర్మించినట్లు చెప్పారు. ఓ వైపు యాదాద్రి కట్టడం నిర్మిస్తే.. మరో వైపు ముచ్చింతల్ లో శ్రీరామానుజాచార్యుల విగ్రహాం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

నేతాజీ జయంతి ఉత్సవాలను స్మరిస్తూ ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Jan Urja Manch 01

Jan Urja Manch 01

Jan Urja Manch 02

Jan Urja Manch 02

Jan Urja Manch

Jan Urja Manch

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జియ్యర్ స్వామితో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీనివాస్ గౌడ్, నీతి ఆయోగ్ మెంబెర్ డాక్టర్ వి.కె. సారస్వత్, డాక్టర్ గురునాథ్ రెడ్డి కాంటినెంటల్ చైర్మన్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: Jackfruit Biryani: ఈ బిర్యానీ చాలా స్పెషల్ గురూ.. పనస బిర్యానీ టేస్ట్‌కు ఫిదా అవ్వాల్సిందే.. ఎలా తయారు చేయాలంటే..?

Health care tips: స్వీట్స్ తినాలంటే భయపడుతున్నారా.. వీటిని ట్రై చేయండి.. అవేంటంటే..