Trains Cancelled: రైల్వే ప్యాసింజర్లకు గమనిక.. మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో 127 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
Montha Cyclone Effect: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అలర్టయ్యింది.. మొంథా తుపాను, వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.. మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది..

మొంథా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తుఫాను తీరం దాటినప్పటికీ.. ప్రభావం మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది.. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.. ఎడతేరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు.. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అలర్టయ్యింది.. మొంథా తుపాను, వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.. మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది.. ఫలక్‌నుమా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. కాగా.. వర్షాల కారణంగా పలు రైల్వేస్టేషన్లలో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్ లో భారీగా వరదనీరు చేరింది..
“Bulletin No.16: SCR PR No.605, dt.29.10.2025 on “Restoration of Trains” pic.twitter.com/COR2MbXwIR
— South Central Railway (@SCRailwayIndia) October 29, 2025
కాగా.. భారీ వర్షాలు వరదలతో.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగులో కోణార్క్ ఎక్స్‌ప్రెస్, డోర్నకల్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయాయి. ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లిలో సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఏపీలోని పలు స్టేషన్లలో భారీ సంఖ్యలో గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి.
కాగా.. వర్షాలు, వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని.. రైల్వే అధికారులు సిబ్బందికి సూచనలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
