Aero Engines in Telangana: టార్గెట్ 2030.. ఏరో ఇంజిన్ రాజధానిగా తెలంగాణ.. మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ ప్రారంభం..
దేశంలోని ఏరో ఇంజిన్ తయారీ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్రాన్ని “ఏరో ఇంజిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”గా తీర్చిదిద్దే లక్ష్యంతో 2030 నాటికి సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.

దేశంలోని ఏరో ఇంజిన్ తయారీ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్రాన్ని “ఏరో ఇంజిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”గా తీర్చిదిద్దే లక్ష్యంతో 2030 నాటికి సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ తయారీ సంస్థ సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన “ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపొనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్” ను వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.425 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ అత్యాధునిక కేంద్రం ద్వారా సుమారు 500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి .
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “హైదరాబాద్ కేవలం సిటీ ఆఫ్ పెరల్స్ మాత్రమే కాదు… దాన్ని సిటీ ఆఫ్ ప్రొపల్షన్, ప్రెసిషన్, ప్రోగ్రెస్‌గా మలుస్తాం. రాష్ట్రాన్ని గ్లోబల్ ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది” అన్నారు.
రాష్ట్రంలోని ఏరోస్పేస్, రక్షణ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లోనే రూ.30,742 కోట్ల ఎగుమతులు నమోదయ్యాయని మంత్రి వెల్లడించారు. ఇది తెలంగాణలో ఈ రంగం సాధించిన విశేష వృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ కొత్త కేంద్రంలో ఎయిర్‌బస్, బోయింగ్ వంటి అంతర్జాతీయ సంస్థల కోసం లీప్ ఇంజిన్లకు అవసరమైన బేరింగ్ హౌసింగ్ (స్టేషనరీ కాంపొనెంట్), లో ప్రెషర్ టర్బైన్ షాఫ్ట్స్ (రోటేటివ్ కాంపొనెంట్) ను తయారు చేయనున్నారు.
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సీఈఓ & మేనేజింగ్ డైరెక్టర్ సుకరన్ సింగ్ మాట్లాడుతూ, “ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపొనెంట్స్ తయారీ కేంద్రం భారతదేశంలోని అధునాతన తయారీ సామర్థ్యానికి చిహ్నం. మా నిబద్ధత, గ్లోబల్ స్థాయి నైపుణ్యానికి ఇది నిదర్శనం” అన్నారు.
తొలిదశలో 500 ఉద్యోగాలు – భవిష్యత్తులో వేల సంఖ్యలో అవకాశాలు..
తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని తీసుకుంటున్న చర్యలతో, రానున్న సంవత్సరాల్లో రాష్ట్రం ఏరోస్పేస్ టెక్నాలజీలో గ్లోబల్ మ్యాప్‌పై ప్రముఖ స్థానాన్ని సంపాదించనుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
The inauguration of the Tata Advanced Systems Limited–Safran Aircraft Engines facility at Adibatla is a proud milestone in Telangana’s aerospace journey. Built with an investment of ₹425 crore, this world-class unit strengthens our mission to make Telangana the ‘Aero-Engine… pic.twitter.com/zqC759HaOH
— Sridhar Babu Duddilla (@OffDSB) October 28, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
