MLC Kavitha: హైదరాబాద్‌కు ఇవాళ కవిత రాక.. స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు
లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. తిహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. దీంతో.. గులాబీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమె ఎప్పుడెప్పుడు హైదరాబాద్ చేరుకుంటారా అని వెయిట్ చేస్తున్నారు. ఐదున్నర నెలల జైలు జీవితం తర్వాత.. ఈరోజు హైదరాబాద్‌కు రాబోతున్నారు.
లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. తిహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. దీంతో.. గులాబీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమె ఎప్పుడెప్పుడు హైదరాబాద్ చేరుకుంటారా అని వెయిట్ చేస్తున్నారు. ఐదున్నర నెలల జైలు జీవితం తర్వాత.. ఈరోజు హైదరాబాద్‌కు రాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్‌లో విచారణకు హాజరుకానున్నారు. కోర్ట్ హియరింగ్స్ ముగియగానే హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. మూడ్రోజులుగా ఢిల్లీలోనే ఉన్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోనే కవితతో కలిసి ప్రెస్‌మీట్ కూడా నిర్వహించనున్నారు. కవితతోపాటు కేటీఆర్, హరీష్ రావు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు రానున్నారు. కాగా.. కవిత హైదరాబాద్ కు రాగానే ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి.. గులాబీ శ్రేణులు ర్యాలీ కూడా నిర్వహించనున్నారు.
కాగా… మంగళవారం బెయిల్‌పై విడుదలైన సమయంలో కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైలు గేటు నుంచి బయటకు రాగానే కొడుకు, భర్త, అన్నను ఆత్మీయ ఆలింగనం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు బాణసంచా కాల్చి, డప్పులు మోగిస్తూ.. ఘనస్వాగతం పలికారు. అటు కన్నీళ్లు పెడుతూనే.. తనను ఇబ్బంది పెట్టిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కవిత. తాను కేసీఆర్ బిడ్డనని.. తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు.. 18ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయలేదని.. ఐదున్నర నెలలు కుటుంబానికి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మొండిని, జగమొండిగా మార్చారని, ఇబ్బంది పెట్టిన వారు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదని కవిత హెచ్చరించారు.
తిహార్ జైలు నుంచి నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లారు. కేటీఆర్, హరీష్‌తో పాటు.. పార్టీ నేతలకు స్వీట్లు పంచారు. చాలాసేపు పార్టీ నాయకులందరితో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలంతా కవితకు ధైర్యం చెప్పారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా.. తగ్గేదేలేదని కవిత పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో.. సీబీఐ, ఈడీ కేసుల్లో సుప్రీం బెయిల్ ఇవ్వడంతో.. 10లక్షల చొప్పున పూచికత్తుపై ఎమ్మెల్సీ కవిత రిలీజ్ అయ్యారు. పాస్‌పోర్ట్ మెజిస్ట్రేట్‌కు సబ్‌మిట్ చేయాలనడంతో ఆ ప్రాసెస్ అంతా త్వరగా పూర్తి చేయడంతో.. ఆమె మంగళవారం రాత్రి విడుదలయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..