AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నా కూతురు ప్రజాసేవ కోసం ప్రజల మధ్యకు రాబోతుంది.. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే ప్రకటన

Hyderabad: అనేకమంది, అనేక రాజకీయ పార్టీలు తనను విమర్శిస్తున్నారని తన జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తమపై ఆరోపణలు చేసి ఏ నాయకుడిని వదిలే ప్రసక్తే లేదన్నారు. పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని మరోసారి హెచ్చరించారు. తనపై దాడి చేసిన నిందితులను మనస్ఫూర్తిగా క్షమించానని చెప్పారు ఓవైసీ.

Telangana: నా కూతురు ప్రజాసేవ కోసం ప్రజల మధ్యకు రాబోతుంది.. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే ప్రకటన
Akbaruddin Owaisi
Noor Mohammed Shaik
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 02, 2023 | 1:34 PM

Share

హైదరాబాద్,అక్టోబర్02: చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బర్ ఉద్దీన్ ఓవేసి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ పాతబస్తీ బండ్ల గూడ…లోని కేజీ టూ పీజీ క్యాంపస్ లో చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బర్ ఉద్దీన్ ఓవైసి తన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళ బ్యూటిషన్ ట్రైనింగ్‌కు సంబంధించి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 200 మంది మహిళలకు బ్యూటిషన్ సర్టిఫికేట్…బ్యూటి కిట్ పంపిణీ చేశారు. మహిళలు ప్రతిరంగంలో ముందుకు రావాలని కోరారు. ఇంట్లో ఉండే మహిళలు బ్యూటిషన్ ద్వారా తమకు తాము సొంతగా ఉపాధి కల్పించుకుంటూ బతకగలగరని ప్రస్తావించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఓవైసీ కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముస్లిం సమాజాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. దేశంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేశారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు.

ఈ కార్యక్రమంలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో తన కూతురు ప్రజా సేవ కోసం ప్రజల మధ్యకు రాబోతుందని చెప్పారు. ప్రస్తుతం తన కూతురు విదేశాల్లో బైరిస్టర్ చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ మొట్టమొదటి యువతీగా పేరు పొందుతుందని చెప్పుకున్నారు. తన కూతురే తన ధైర్యం అని చెప్పారు. తన కూతురు తనకి ప్రాణం అంటూ అక్బరుద్దీన్ ఓవేసి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాశంగా మారాయి.. తన కూతురు తన కన్న ఎక్కువగా చదువుకుందని, తన కూతురికి కాబోయే భర్త తనకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు దొరికేంత వరకు ఆమెకు వివాహం చేయనని చెప్పాడు. అదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పానని అక్బరుద్దీన్ ఓవైసీ బహిరంగంగా ప్రజల ముందు ప్రస్తావించారు.

అనేకమంది, అనేక రాజకీయ పార్టీలు తనను విమర్శిస్తున్నారని తన జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రజలకు సేవ చేసి విమర్శించాలి.. కాని కొంతమంది విమర్శలకే పరిమితమైపోయారంటూ ఆరోపించారు. తమపై ఆరోపణలు చేసి ఏ నాయకుడిని వదిలే ప్రసక్తే లేదన్నారు. పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని మరోసారి హెచ్చరించారు. తనపై దాడి చేసిన నిందితులను మనస్ఫూర్తిగా క్షమించానని చెప్పారు ఓవైసీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..