Uterus in Man Stomach: ఇదెక్కడి విడ్డూరం.. కడుపునొప్పితో వచ్చిన యువకుడి కడుపులో గర్భాశయం.. ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్..!

ఈ హార్మోన్ పురుషులలో మాత్రమే ఉంటుంది. దాని లోపం కారణంగా, స్త్రీ అవయవాలు పురుషులలో అభివృద్ధి చెందుతాయి. కానీ ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి 300 కేసులు నమోదయ్యాయి ఇందులో 8 నెలల నుండి 27 సంవత్సరాల వయస్సు గల వారిలో ఇలాంటి కేసులు బయటపడ్డాయి.

Uterus in Man Stomach:  ఇదెక్కడి విడ్డూరం.. కడుపునొప్పితో వచ్చిన యువకుడి కడుపులో గర్భాశయం.. ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్..!
Uterus In Man Stomach
Follow us

|

Updated on: Oct 02, 2023 | 12:03 PM

వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన ఉదంతం ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసింది. కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన యువకుడి కడుపులో అభివృద్ధి చెందని గర్భాశయాన్ని గుర్తించిన వైద్యులు షాకయ్యారు. అయితే పురుషులలో గర్భాశయం ఉండటం చాలా అరుదు. అనంతరం వైద్యులు అతడికి ఆపరేషన్‌ చేసి ఆ గర్భాశయాన్ని బయటకు తీశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఇలాంటివి 300 కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్ గఢ్ లోని ధమ్ తరి జిల్లాలో తాజాగా ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 25న 27 ఏళ్ల యువకుడు ఆస్పత్రిలో చేరగా, గర్భాశయం గుర్తించి గంటన్నర శ్రమించి సర్జరీ ద్వారా దాన్ని తొలగించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ధమ్‌తరి జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువకుడు చాలా రోజులుగా కడుపులో నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 25 న అతని కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం ధామ్‌తరి నర్సింగ్ హోమ్‌కు తీసుకువచ్చారు. సెప్టెంబరు 26న ధామ్‌తరిలోని ప్రైవేట్ ఉపాధ్యాయ్ నర్సింగ్‌హోమ్‌లో యువకుడు అరుదైన ఆపరేషన్ చేయించుకున్నాడు. అక్టోబర్ 1న డిశ్చార్జ్ అయ్యాడు. అయితే, యువకుడి వివరాలను గోప్యంగా ఉంచారు.

ఈ సందర్భంగా సర్జరీ చేసిన డాక్టర్ రోషన్ ఉపాధ్యాయ వివరాలు వెల్లడించారు.. యువకుడికి అవసరమైన సర్జరీ కోసం టెస్టులు చేస్తుండగా.. అతనికి హెర్నియా చిక్కుకుపోయిందని, రెండు వైపులా వృషణాలు కూడా కనిపించడం లేదని తేలింది. దీని తర్వాత యువకుడికి ఆపరేషన్ చేశామని చెప్పారు. ఈ క్రమంలోనే అతని కడుపులో గర్భాశయం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. యువకుడి కడుపులో గర్భాశయం, స్టెరిలైజేషన్ ట్యూబ్, అలాగే కుడి వైపున అతని కడుపుకు రెండు వైపులా వృషణాలు ఉన్నాయి. దీంతో విషయం వెంటనే రోగి కుటుంబ సభ్యులకు వివరించామన్నారు. సర్జరీ తర్వాత అన్ని అవయవాలను కూడా కుటుం సభ్యులకు చూపించారు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత కుటుంబసభ్యుల అనుమతితో యువకుడి కడుపులోపల ఉన్న గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్, కుడి వృషణానికి ఆపరేషన్ చేసి కడుపులో నుంచి తొలగించామని, దీంతో పాటు కుడివైపు హెర్నియాకు కూడా ఆపరేషన్ చేశామని వైద్యుడు ఉపాధ్యాయ్ తెలిపారు. . ఈ వ్యాధిని పెర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్ సిండ్రోమ్ (పీఎండీఎస్)గా చెప్పారు. జన్యువులలో పరస్పర మార్పుల వల్ల ఇది సంభవిస్తుంది. ఇందులో, పురుష జననేంద్రియాలు బాహ్యంగా సాధారణంగా ఉంటాయి. ఈ ఆపరేషన్‌లో డాక్టర్ రోషన్ ఉపాధ్యాయ్, డాక్టర్ మార్టిన్, డాక్టర్ రష్మీ ఉపాధ్యాయ, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ దేవాంగన్ పాల్గొన్నారు.

ఈ రకమైన వ్యాధిని పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ అంటారు. వైద్యుల ప్రకారం, యాంటీ-ముల్లెరియన్ హార్మోన్ పురుషులలో మాత్రమే ఉంటుంది. దాని లోపం కారణంగా, స్త్రీ అవయవాలు పురుషులలో అభివృద్ధి చెందుతాయి. కానీ ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి 300 కేసులు నమోదయ్యాయి ఇందులో 8 నెలల నుండి 27 సంవత్సరాల వయస్సు గల వారిలో ఇలాంటి కేసులు బయటపడ్డాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు