Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫీసులో ఒకేచోట‌ 8 గంటలు కూర్చోవడం ప్రాణాంతకం! ఇలా ఐదు నిమిషాలు నడిస్తే, ఐదేళ్లకు పైగా బతుకుతారు!

అయితే, కొందరు ఎనిమిది గంటలు కూర్చొని పనిచేస్తూ ఉదయం లేదా సాయంత్రం పదివేల అడుగుల వాకింగ్‌ చేస్తుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కూడా మంచిదే. కానీ, ప్రతి గంటకు ఐదు నిమిషాలు లేదా అరగంటకు మధ్యలో ఐదు నిమిషాలు కాస్త నడవడం ఇంకా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆఫీసులో ఒకేచోట‌ 8 గంటలు కూర్చోవడం ప్రాణాంతకం! ఇలా ఐదు నిమిషాలు నడిస్తే, ఐదేళ్లకు పైగా బతుకుతారు!
Sitting In Office
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 02, 2023 | 11:38 AM

నిశ్చల జీవనశైలి.. ఎక్కువ సమయం కదలకుండానే కూర్చిని పనిచేయటం.. అనేది ప్రపంచంలో మిలియన్ల మందిని చంపేస్తున్న ప్రమాదం. శారీరక శ్రమ లేకపోవడం వల్ల 95% మంది ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. కార్యాలయంలో ఎక్కువ గంటలు కూర్చొని పని చేయడం వల్ల అనేక వ్యాధులు ఎటాక్‌ చేయటంతో చనిపోతున్నారని ఫ్రాన్స్ నేషనల్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మధుమేహం, గుండె సమస్యలు, మరణాలకు కారణం నిశ్చల జీవనశైలి ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటిగా తేల్చారు.. అందువల్ల, మీరు కూర్చునే సమయాన్ని తగ్గించడం అవసరం. దీని కోసం ఏం చేయాలి.. కొలంబియా యూనివర్శిటీ మెడికల్ సెంటర్ (న్యూయార్క్)లో బిహేవియరల్ మెడిసిన్ ప్రొఫెసర్ కీత్ డియాజ్, ఈ నిశ్చల జీవనశైలిని విధానాన్ని మార్చడానికి మంచి మార్గాన్ని సూచిస్తున్నారు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురించబడింది. పరిశోధనా బృందం 11 మంది వాలంటీర్లను నియమించింది. వారిని ఎనిమిది గంటల పాటు కుర్చీలో కూర్చోవాలని సూచించింది. వారు ల్యాప్‌టాప్‌లలో పని చేయడానికి, వారి ఫోన్‌లను చూసుకోవడానికి, ఉపయోగించేలా ఏర్పాట్లు చేశారు. వారంతా 40 నుండి 60 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. వారికి మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలేవి లేవు. వారు ఐదు రోజుల పాటు పరిశోధకులు సూచించిన పద్దతులను పాటించారు.. మొదటిది,ఎనిమిది గంటల పాటు నడవకుండా ఒకే చోట కూర్చుని పనిచేయాలి.

విశ్వవిద్యాలయ పత్రికా ప్రకటన ప్రకారం… పరిశోధకులు పరీక్షలో పాల్గొనేవారి మానసిక స్థితి, అలసట, పనితీరు స్థాయిలను పర్యవేక్షించారు. ఈ అధ్య‌య‌నం ప్ర‌కారం.. ఒకే స్థలంలో కూర్చుని రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు పనిచేసే వ్యక్తులు గుండెపోటు, స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం 20 శాతం ఎక్కువ అని తేలింది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం దాదాపు 50 శాతం పెరుగుతుందని నిర్ధారణ అయింది. అలాగే, ఎక్కువ సమయంలో కూర్చుని పనిచేసే వారి కంటే.. ఇతరులలో అలసట తక్కువగా ఉన్నట్టు గమనించారు.

ఇవి కూడా చదవండి

దీనిని బట్టి  కూర్చున్న స్థానం నుండి లేచి, ప్రతి అరగంటకు ఐదు నిమిషాలు నడవడం వల్ల ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. ఇది రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు రెండింటినీ గణనీయంగా తగ్గిస్తుంది. కార్డియోమెటబోలిక్ ప్రమాద కారకాలు ప్రతిసారీ తగ్గుతాయి. రోజంతా కూర్చోవడంతో పోలిస్తే, ఇది రక్తంలో చక్కెర స్పైక్‌లను 58% తగ్గిస్తుంది.

అయితే, కొందరు ఎనిమిది గంటలు కూర్చొని పనిచేస్తూ ఉదయం లేదా సాయంత్రం పదివేల అడుగుల వాకింగ్‌ చేస్తుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కూడా మంచిదే. కానీ, ప్రతి గంటకు ఐదు నిమిషాలు లేదా అరగంటకు మధ్యలో ఐదు నిమిషాలు కాస్త నడవడం ఇంకా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజూ కనీసం 10,000 అడుగులు క్రమం తప్పకుండా నడిచే వారు ఆరోగ్యంగా ఉంటారు. నడక అలవాటు లేని, పగటిపూట ఎలాంటి వ్యాయామాలు చేయని వారి కంటే ఇలా నడిచే వారు కనీసం ఐదేళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని సర్వేలు చెబుతున్నాయి. జర్మనీలో పదివేల మందిపై నిర్వహించిన అధ్యయనం ఇది రుజువు చేసింది..

– రోజంతా ఏదో ఒక రకంగా నడిచేందుకు చూడండి..

– తాగే నీటిని సీటుకు దూరంగా పెట్టుకోండి..నీళ్ల కోసమైన తరచూ లేచి నడవండి

– మెట్లు ఎక్కి పైకి కిందకు వెళ్ళండి. అది ఇంకా మంచిది. ఇది మీ గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

– ఫోన్ వచ్చినప్పుడు నిలబడి నడవడం అలవాటు చేసుకోండి.

– ఇంట్లో చేతులకుర్చీలు పెట్టుకోవద్దు. అందులో కూర్చుంటే లేవాలనిపించదు.

– ఇంటి నుండి పని చేస్తున్నట్లయితే mattress లేదా ఫోమ్ బెడ్ మీద కూర్చోవద్దు.