Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ కట్టడానికి త్వరలో భూమిపూజ.. రోగులకు వరంలా..

హైదరాబాద్‌లో మరో భారీ నిర్మాణం జరగనుంది. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చే ఉద్దేశంతో నిమ్స్‌ నూతన భవనానికి భూమిపూజ చేయనున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో శంఖుస్థాపన చేయనున్నారు. మంగళవారం తెలంగాణ కొత్త సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి హరీష్‌ రావు..

Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ కట్టడానికి త్వరలో భూమిపూజ.. రోగులకు వరంలా..
Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: May 02, 2023 | 5:05 PM

హైదరాబాద్‌లో మరో భారీ నిర్మాణం జరగనుంది. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చే ఉద్దేశంతో నిమ్స్‌ నూతన భవనానికి భూమిపూజ చేయనున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో శంఖుస్థాపన చేయనున్నారు. మంగళవారం తెలంగాణ కొత్త సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి హరీష్‌ రావు ఈ విషయాలను వెల్లడించారు. ప్రభుత్వ నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2000 పడకల నూతన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో భూమి పూజ చేసుకోబోతున్నామని, త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాల నేపథ్యంలో హైదరాబాద్ నలువైపులా ఒక్కోటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంతో పాటు, నిమ్స్ విస్తరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.

మొత్తం మూడు బ్లాకుల్లో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలు అందించే విధంగా ఉండే ఈ నూతన నిర్మాణానికి అవసరమైన అన్ని విభాగాల అనుమతులు పూర్తి చేసుకొని, నిర్మాణం మొదలు పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ఎనిమిది అంతస్తుల్లో నిర్మించే నూతన నిమ్స్ నిర్మాణం అందుబాటులోకి వస్తే, 1500 గా ఉన్న పడకల సంఖ్య మొత్తం 3500కు చేరుతుందన్నారు. ఇటీవల భూమిపూజ చేసుకున్న సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పూర్తయితే తద్వారా మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయని, ఒక్క నిమ్స్ లోనే మొత్తం 3700 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. తద్వారా నిమ్స్ సేవలు మరింత విస్తృతం అవుతాయని చెప్పారు. నిమ్స్ ఎంసీహెచ్ పనులు వేగవంతం చేయాలన్నారు. దీంతో పాటు గాంధీ ఆసుపత్రిలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులు ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఫెర్టీలిటీ సేవలు..

ఫెర్టీలిటీ సేవలు ప్రజలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గాంధీలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాన్ని, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ పనులు వేగవంతం చేయాలన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు చేస్తున్నట్లుగా, గాంధీలోనూ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ ను మంత్రి ఆదేశించారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ పొందేలా చూడాలన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..