AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీ కళ్లు షార్ప్‌గానే ఉన్నాయా?.. అయితే ఈ 2 చిత్రాల మధ్య ఉన్న తేడాలను 59 సెకెన్లలో కనిపెట్టండి!

సోషల్ మీడియాలో రోజూ అనేక రకాల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీజర్స్, ఫజిల్ చిత్రాలు జనాలను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని పరిష్కరించడం ద్వారా జనాలు వారి తెలివితేటలను పెంచుకుంటారు. ఈ ప్రక్రియ వారికి నిజ జీవితంలో ఎదురయ్య సమస్యలను ఎదుర్కోవడంతో సహాయపడుతుంది.

Optical Illusion: మీ కళ్లు షార్ప్‌గానే ఉన్నాయా?.. అయితే ఈ 2 చిత్రాల మధ్య ఉన్న తేడాలను 59 సెకెన్లలో కనిపెట్టండి!
Optical Illusion Challenge
Anand T
|

Updated on: Feb 14, 2026 | 10:47 AM

Share

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీజర్స్ మన కళ్లకు, మెదడుకు పని చెప్పడంతో పాటు మన తిలివితేటను, జ్ఞాపనకశక్తిని మెరుపర్చేందుకు సహాయపడుతాయి. అందుకే చాలా మంది సమయం దొరికినప్పుడల్లా వీటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇలా తరచుగా వీటిని పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ పనితీరును పెంచుకోవచ్చు. వీటిని సాల్వ్ చేయడం అంత సులభం కాదు. ఇవి చాలా క్లిష్టంగా ఉంటాయి. అలాంటప్పుడు వాటిని సాల్వ్ చేసేందుకు మనం బుర్రకు ఎక్కవగా పని చెబుతాం.

దీని వల్ల మన బ్రెయిన్ యాక్టీవ్‌గా పనిచేయడ ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా శక్తిని పెంచుకోవడం ద్వారా ఎలాంటి సమస్యనైనా ఈజీగా పరిష్కరించవచ్చు. మీరూ ఇలా తెలివితేటలను పెంచుకోవాలని అనుకుంటే ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఈ ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి.

వైరల్‌ ఫోటోలో ఏముంది

వైరల్ అవుతున్న ఈ చిత్రంలో మీకు ఒక బాలుడు, బాలిక నడుచుకుంటూ స్కూల్‌కు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. వారి వెనకాలే రెండు ఇళ్లు, చెట్ల పొదలు ఉన్నాయి. పక్కపక్కనున్న ఈ రెండు ఫోటోలో సేమ్ ఒకేలా అనిపిస్తాయి. అయితే ఆ రెండు ఫొటోల్లో మూడు చిన్న తేడాలున్నాయి. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే ఈ తేడాలను మీరు 59 సెకన్లలో కనిపెట్టాలి. మీరు ఈ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్దమైతే మీ టాస్క్ ఇప్పుడే మొదలవుతుంది.

3 తేడాలు కనిపెట్టారా?

ఇచ్చిన టైంలో మీరు ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న మూడు తెడాలను కనిపెట్టినట్లయితే కంట్రాగ్స్, మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయని అర్థం. ఒక వేళ మీరు తేడాలను గుర్తించలేకపోయినా ఏం పర్లేదు. మీకు మేం సహాయం చేస్తాం. ఈ కింద్ర ఇచ్చిన చిత్రంలో తేడాలను మేం సర్కిల్ చేసి ఉంచాం.. అక్కడ మీరు సమాధానం కనుగొనవచ్చు.

Optical Illusion Challenge

Optical Illusion Challenge

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.