ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్!
తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025 నుంచి 2028 వరకు అమలయ్యే ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల ఖరారు ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. గతంలో TAFRC సూచించిన భారీ పెంపును అమలు చేస్తే విద్యార్థులపై భారీ భారం పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఫీజుల నిర్ణయంలో కీలక మార్పులు చేసింది. విద్యార్థులపై భారీ భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గతంలో టీఏఎఫ్‌ఆర్‌సీ (TAFRC) కొన్ని ప్రముఖ కాలేజీలకు 60 నుండి 70 శాతం వరకు ఫీజులు పెంచాలని ప్రతిపాదించింది. ఉదాహరణకు, సీబీఐటీ వంటి కాలేజీల్లో ఫీజు రూ. 1.65 లక్షల నుండి రూ. 2.23 లక్షలకు పెరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే, మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. కేవలం ఖర్చులనే కాకుండా.. విద్యా నాణ్యత, ప్లేస్‌మెంట్స్, ఎన్ఏఏసీ (NAAC) గ్రేడింగ్, ఎన్ఐఆర్ఎఫ్ (NIRF) ర్యాంకింగ్‌లను కొలమానాలుగా తీసుకోవాలని ఆదేశించారు. ఈ విధానాన్ని కోర్టు ద్వారా కూడా స్పష్టం చేయడంతో.. ఫీజుల ఖరారులో పెంపు కంటే నాణ్యతనే ప్రధాన ప్రమాణంగా తీసుకున్నట్లు సమాచారం. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 150కి పైగా ఇంజినీరింగ్ కాలేజీల్లో మెజారిటీ కాలేజీలకు పాత ఫీజులే యథాతథంగా కొనసాగనున్నాయి. కొన్ని కాలేజీలకు మాత్రమే 10 నుంచి 15 శాతం మేర స్వల్ప పెంపు ఉండవచ్చని తెలుస్తోంది.
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

