AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తృటిలో తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందో మీరే చూడండి

తృటిలో తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందో మీరే చూడండి

Phani CH
|

Updated on: Feb 14, 2026 | 9:30 AM

Share

హైదరాబాద్‌లోని న్యూ మలక్‌పేట్ ప్రధాన రహదారిపై లాల్జార్ హోటల్ సమీపంలో రోడ్డు కుంగి భారీ గుంత ఏర్పడింది. ఇటీవల పూడ్చిన రోడ్డు భాగం కింద నీటి పైప్‌లైన్ లీకేజీ కారణంగా మట్టి కొట్టుకుపోయి ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ట్రాక్టర్ వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. పోలీసులు, ఎమ్మెల్యే బలాలా తక్షణమే స్పందించి మరమ్మతులకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

హైదరాబాద్‌ .. న్యూ మలక్‌పేట్ ప్రధాన రహదారిపై ఒక్కసారిగా భూమి కుంగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లాల్జార్ హోటల్ సమీపంలో ఇటీవల మట్టితో పూడ్చిన రోడ్డు భాగం అకస్మాత్తుగా కూలిపోయి, భారీ గుంత ఏర్పడటంతో వాహనదారులు హడలెత్తిపోయారు. రోడ్డుపై ఒక ట్రాక్టర్ వెళ్తున్న సమయంలో, ఇటీవల ప్యాచ్ వర్క్ చేసిన ప్రాంతం కుంగిపోయింది. చూస్తుండగానే రోడ్డు మధ్యలో భారీ గుంత ఏర్పడింది. ఆ గుంత లోపల నీటి పైప్‌లైన్ లీకేజీ కూడా ఉండటంతో, నీటి ప్రవాహానికి లోపల మట్టి కొట్టుకుపోయి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో వాహనాలు తక్కువగా ఉండటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న వెంటనే దబీర్‌పురా, మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గుర్తించి, గుంత చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఈ విషయం తెలుసుకున్న మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని పార్టీ కార్యకర్తలను, అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారిపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, సంబంధిత శాఖలు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్