Jubilee Hills Incident: నీటి గుంతలో పడి బాలుడి మృతి
హైదరాబాద్‌లో నీటి గుంతలు చిన్నారుల పాలిట శాపంగా మారుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు బలవుతున్నాయి. ఐదు రోజుల క్రితం సికింద్రాబాద్ కళాసిగూడలోని నాలాలో చిన్నారి మౌనిక మృతి చెందిన ఘటన మరువకముందే హైదరాబాద్‌లో మరో ఘటన జరగడం కలకలం రేపుతోంది.
హైదరాబాద్‌లో నీటి గుంతలు చిన్నారుల పాలిట శాపంగా మారుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు బలవుతున్నాయి. ఐదు రోజుల క్రితం సికింద్రాబాద్ కళాసిగూడలోని నాలాలో చిన్నారి మౌనిక మృతి చెందిన ఘటన మరువకముందే హైదరాబాద్‌లో మరో ఘటన జరగడం కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు వివేక్ చనిపోయాడు. ఆడుకుంటు వెళ్లి నీటి గుంతలో పడి మృతి చెందాడు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా దీస్తున్నారు. బతుకుదెరువు కోసం వివేక్ ఫ్యామిలీ ఏడేళ్ల క్రితం కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చింది. బాబు తండ్రి భీమాశంకర్ ఇంటి పక్కనే ఉన్న ఓ బైక్ షోరూం వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొన్ని క్షణాలు నీడలు మాయం.. ఈ విచిత్రం వెనక రీజన్ ఏంటో తెలుసా ??
పులి పిల్లలకు పాలిచ్చి.. తల్లి ప్రేమను పంచిన కుక్క..
నా బిడ్డ నాకు నమ్మకద్రోహం చేసాడు.. ఆవేదన వ్యక్తం చేసిన చైతన్య మాస్టర్ తల్లి
Malla Reddy: కేసీఆర్, కేటీఆర్ పై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు