కొన్ని క్షణాలు నీడలు మాయం.. ఈ విచిత్రం వెనక రీజన్ ఏంటో తెలుసా ??

కొన్ని క్షణాలు నీడలు మాయం.. ఈ విచిత్రం వెనక రీజన్ ఏంటో తెలుసా ??

Phani CH

|

Updated on: May 01, 2023 | 9:59 PM

వస్తువులకైనా, మనుషులకైనా నీడ వెంట ఉండడం తప్పనిసరి. అయితే ఏప్రిల్‌ 25, 2023న బెంగుళూరు ఓ అద్భుత ఖగోళ వింతకు వేదికైంది. ఆ రోజు నగరంలో నీడలు మాయమయ్యాయి. జీరో షాడో డే గా పిలిచే ఈ వింత మధ్యాహ్నం 12.17 నిమిషాలకు జరిగింది.

వస్తువులకైనా, మనుషులకైనా నీడ వెంట ఉండడం తప్పనిసరి. అయితే ఏప్రిల్‌ 25, 2023న బెంగుళూరు ఓ అద్భుత ఖగోళ వింతకు వేదికైంది. ఆ రోజు నగరంలో నీడలు మాయమయ్యాయి. జీరో షాడో డే గా పిలిచే ఈ వింత మధ్యాహ్నం 12.17 నిమిషాలకు జరిగింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తన క్యాంపస్‌లో ఈవెంట్లు నిర్వహించిదీని వెనకున్న సైన్స్‌ను సమాన్యులకు అర్థమయ్యేలా చెప్పింది. ఈవెంట్లలో పాల్గొన్న ఔత్సాహికులు నీడ, దాని కదలికలకు సంబంధించి సమాచారం తెలుసుకున్నారు. అంతా ఒక చోట సర్కిల్ గా నిలబడి వారి నీడలను గమనించారు. ఒక బాటిల్ వాటర్, PVC పైపులు, గరిటెలు ,యు రంధ్రాలతో కూడిన కాగితాన్ని నేల మధ్యలో ఉంచారు. మధ్యాహ్నం 12.17 గంటలకు నీడలు అదృశ్యం కావడం, నెమ్మదిగా కదులుతూ మళ్లీ కనిపించడం గమనించి ఆశ్చర్యపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పులి పిల్లలకు పాలిచ్చి.. తల్లి ప్రేమను పంచిన కుక్క..

నా బిడ్డ నాకు నమ్మకద్రోహం చేసాడు.. ఆవేదన వ్యక్తం చేసిన చైతన్య మాస్టర్‌ తల్లి

Malla Reddy: కేసీఆర్, కేటీఆర్ పై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Published on: May 01, 2023 09:59 PM