ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టానా
హెల్మెట్ లేకుండా బైక్ నడపడం చట్ట విరుద్ధం. అయినా చాలా మంది హెల్మెట్ లేకుండా బైక్‌తో తుర్రుమని దూసుకొస్తుంటారు. హఠాత్తుగా పోలీసులు కంటపడితే రకరకాల ట్రిక్కులు ఉపయోగించి జరిమానాల నుంచి తప్పించుకుంటారు. తాజాగా ఓ కుర్రాడి జిత్తుల మారి ఎత్తుకు పోలీసులు చిత్తు అయ్యారు.
హెల్మెట్ లేకుండా బైక్ నడపడం చట్ట విరుద్ధం. అయినా చాలా మంది హెల్మెట్ లేకుండా బైక్‌తో తుర్రుమని దూసుకొస్తుంటారు. హఠాత్తుగా పోలీసులు కంటపడితే రకరకాల ట్రిక్కులు ఉపయోగించి జరిమానాల నుంచి తప్పించుకుంటారు. తాజాగా ఓ కుర్రాడి జిత్తుల మారి ఎత్తుకు పోలీసులు చిత్తు అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ కుర్రాడు హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళ్తున్నాడు. అంతలో రోడ్డుపై అతడికి ట్రాఫిక్ పోలీసులు కనిపించారు. దీంతో ఆ కుర్రాడు ఓ ట్రిక్కు ఉపయోగించి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఆ కుర్రాడు పోలీసులను చూడగానే స్కూటీ దిగి తోసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు అతడిని పట్టించుకోలేదు. పోలీసులను దాటి పోగానే ఆ కుర్రాడు స్కూటీ స్టార్ట్ చేసుకుని వేగంగా తుర్రుమని మాయమైపోయాడు. ఈ ఘటన మొత్తాన్ని రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో కాస్తా తెగ వైరల్ అవుతోంది. దీంతో“ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టాన“ని నెటిజన్లు నిట్టూరుస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొన్ని క్షణాలు నీడలు మాయం.. ఈ విచిత్రం వెనక రీజన్ ఏంటో తెలుసా ??
పులి పిల్లలకు పాలిచ్చి.. తల్లి ప్రేమను పంచిన కుక్క..
నా బిడ్డ నాకు నమ్మకద్రోహం చేసాడు.. ఆవేదన వ్యక్తం చేసిన చైతన్య మాస్టర్ తల్లి
Malla Reddy: కేసీఆర్, కేటీఆర్ పై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

