పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా పట్టుబడిన అక్రమ మద్యం సీసాలను అధికారులు ధ్వంసం చేశారు. రోడ్ రోలర్ సహాయంతో ఈ సీసాలను ధ్వంసం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ జరిగింది. అక్రమ మద్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదనడానికి ఇది నిదర్శనం.