Merutsav 2022: ఘనంగా మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ‘మేరుత్సవ్‌ 2022’ ఫెస్ట్‌.. వివిధ పోటీల్లో సత్తాచాటిన విద్యార్ధులు!

మేరు ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహించిన మూడో వార్షిక ఇంటర్ స్కూల్ ఫెస్ట్ 'మేరుత్సవ్‌ 2022' అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యేడాది జూలై 20 నుంచి ఆగస్టు 10 వరకు..

Merutsav 2022: ఘనంగా మేరు ఇంటర్నేషనల్ స్కూల్ 'మేరుత్సవ్‌ 2022' ఫెస్ట్‌.. వివిధ పోటీల్లో సత్తాచాటిన విద్యార్ధులు!
Merutsav 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 21, 2022 | 6:13 PM

Merutsav 2022 biggest Inter School Fest in Hyderabad: మేరు ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహించిన మూడో వార్షిక ఇంటర్ స్కూల్ ఫెస్ట్ ‘మేరుత్సవ్‌ 2022’ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యేడాది జూలై 20 నుంచి ఆగస్టు 10 వరకు ఈ వేడుకలు జరిగాయి. కోవిడ్‌ కారణంగా 2020 నుంచి హైదరాబాద్‌లోనున్న అన్ని స్కూళ్ల పిల్లలకు వర్చువల్‌ (ఆన్‌లైన్‌) మోడ్‌లో ‘మేరుత్సవ్’ పోటీలు నిర్వహించింది. వరుసగా రెండేళ్లపాటు ఆన్‌లైన్‌లో వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విద్యార్ధులు సత్తా చాటారు. మొదటి రెండు వార్షాకోత్సవాలను వర్చువల్‌ మోడ్‌లో నిర్వహించిన మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఈ ఏడాది ఆఫ్‌లైన్‌ విధానంలో ‘మేరుత్సవ్‌’ను జరుపుకొంది. దాదాపు 26 టాప్ స్కూళ్ల నుంచి 3800లకు పైగా విద్యార్ధులు ఈ పోటీలకు హాజరయ్యారు.

Merutsav 2022 Awards

Merutsav 2022 Awards

‘మేరుత్సవ్‌ 2022’లో పాల్గొన్న టాప్ 26 స్కూళ్లు ఇవే..

  • మేరు ఇంటర్నేషనల్ స్కూల్
  • గ్లెన్‌డేల్ అకాడమీ ఇంటర్నేషనల్
  • హిందూ పబ్లిక్ స్కూల్
  • శాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్
  • ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్
  • చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్
  • కైరోస్ గ్లోబల్ స్కూల్
  • ఢిల్లీ పబ్లిక్ స్కూల్
  • మెరిడియన్ వరల్డ్ స్కూల్
  • ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్
  • ఫీనిక్స్ గ్రీన్స్ స్కూల్
  • మంథన్ ఇంటర్నేషనల్ స్కూల్
  • ది శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్
  • పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్
  • ది జైన్ ఇంటర్నేషనల్ స్కూల్
  • శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్
  • గాంగెస్ వ్యాలీ స్కూల్
  • విబ్‌గ్యార్ ఇంటర్నేషనల్ స్కూల్
  • సంస్కృతి స్కూల్
  • పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్
Merutsav 2022 Winners

Merutsav 2022 Winners

హైదరాబాద్ విద్యార్థుల్లో పోటీ స్ఫూర్తిని నింపడంలో మేరుత్సవ్-2022 తన వంతు కృషి చేసిందని చెప్పాలి. ఈ ఇంటర్‌ స్కూల్‌ పోటీలను వీక్షించేందుకుగానూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేసింది. మేరుత్సవ్-2022 కాంపిటీషన్లలో పాల్గొనే విద్యార్ధుల్లో దాగున్న ఇంటలెక్చువల్‌, ఎమోషనల్‌ స్థాయిలను పరీక్షించే రకరకాల పోటీలు జరిగాయి. విద్యార్ధుల ప్రతిభా వారి భవిష్యత్తకు మాత్రమేకాకుండా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా తెలియజేసే ప్రతయ్నం చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రీ ప్రైమరీ నుంచి టెన్త్‌ క్లాస్‌ విద్యార్థుల వరకు ఆరు వేర్వేరు విభాగాల్లో దాదాపు 70కి పైగా ఈవెంట్లను నిర్వహించింది. ఆర్ట్‌, మ్యూజిక్‌ నుంచి స్పోర్ట్స్‌, సాంకేతికత వరకు మొత్తం 10 విభిన్న కేటగిరీల్లో పోటీలు జరిగాయి. ‘మిస్టిక్ యోగిస్’, ‘ఫిట్‌నెస్ ఫ్రీక్స్’, ‘టైక్వాండో పూమ్సే ఛాంపియన్‌షిప్’, ‘ఎక్స్‌టెంపోర్’, ‘రెసిటేషన్ – ఇంగ్లీష్’, ‘డైవింగ్ ఇన్ కలర్స్- హిస్టారికల్ మాన్యుమెంట్’, ‘బీట్స్ అండ్‌ ట్యూన్స్, ‘తెలుగు లాంగ్వేజ్‌లో స్పీచ్’, ‘HTML కోడింగ్‌’, ‘సైన్స్ పిక్షనరీ’, ‘స్టూడెంట్ రిపోర్టర్’, ‘రాక్ విత్ ప్రాప్’, ‘టైనీ చెఫ్’,‘షో అండ్ టెల్’, ‘మ్యాథ్ విజార్డ్’, హిందీ/ఇంగ్లీష్/తెలుగు భాషల్లో ‘న్యూస్ రిపోర్టర్’, ఇన్‌వెన్షన్స్‌ తదితర పోటీలు జరిగాయి. 70 ఈవెంట్లలో ప్రతిభ కనబరచిన వారికి 2 ప్రైజ్‌ కేటగిరీల (గోల్డ్‌, సిల్వర్‌) కింద దాదాపు 500కు పైగా విద్యార్ధులకు ఇండివిడ్యువల్ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. వివిధ కేటగిరీల్లో విద్యార్ధులు సాధించిన పాయింట్లు ఆధారంగా టాప్‌ 3 స్కూళ్లను గుర్తించి, బహుమతులు ప్రదానం చేశారు. మొత్తం మీద మేరుస్తవ్‌ 2022 కార్యక్రమం అద్భుతంగా నిర్వహించింది.

Merutsav 2022 Competetions

Merutsav 2022 Competetions

కాగా హైదరాబాద్‌లోని చందానగర్‌లోనున్న మేరు ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను ఫౌండర్‌ మేఘనారావ్‌ జూపల్లి 2017, జులై 19న ప్రారంభించారు. సీబీఎస్సీ అఫిలియేటెడ్‌ అయిన ఈ స్కూల్‌లో దాదాపు 1500లకుపైగా విద్యార్ధులు చదువుతుండగా, 250 మందికి పైగా స్టాఫ్‌ పనిచేస్తున్నారు. స్కూల్‌ ప్రారంభమైన అనతికాలంలోనే విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అద్భుతమైన ఘనత సాధించి, మంచి పేరు ప్రఖ్యాతులు పొందింది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?