Hyderabad: ఏంటి డాక్టర్ ఇంత పని చేశావ్.. మరో నెలలో పెళ్లి.. ఇంతలోనే..
రచన రెడ్డి చేతికి కెనాన్ ఉండటం.. కారులో వైల్స్, సిరంజిలు ఉండటంతో.. పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి కింద కేసు నమోదు చేశారు. వైల్స్, సిరంజి లను ఎఫ్ ఎస్ ఎల్ కు పంపారు పోలీసులు. FSL రిపోర్ట్ వచ్చిన తర్వాతే.. ఎలాంటి ఇంజక్షన్ రచన తీసుకుంది అనేది నిర్ధారించగలమని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులను విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆమె ఓ డాక్టర్.. ఒత్తిడికి లోనవుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మైండ్ సెట్ మార్చాల్సింది పోయి.. తానే ఒత్తిడికి లోనైంది.. ఈ క్రమంలోనే క్షణికావేశానికి లోనై జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంది. ఆమెకు మరో డాక్టర్ తో పెళ్లి సంబంధం కూడా కుదిరింది.. నెలైతే పెళ్లి పీటలు ఎక్కాల్సింది పోయి.. కానరానిలోకాలకు వెళ్ళింది.. వివరాల ప్రకారం.. డాక్టర్.. మోతే రచనా రెడ్డి… ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఖమ్మంలో పీజీ చేస్తూ.. బాచుపల్లిలోని మమత హాస్పిటల్ లో ఇంటర్న్షిప్ చేస్తోంది. ఇంటి నుంచి హాస్పిటల్ కి వెళ్తున్నాను అని చెప్పిన రచన రెడ్డి… నిన్న అమీన్ పూర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై తన కారులో శవమై తేలింది. ఔటర్ రింగ్ రోడ్డులో ఓ కారు.. రోడ్డు రైలింగ్ కి ఢీ కొట్టి ప్రమాదానికి గురవగా ఇతర వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులో రచన మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. డెడ్ బాడీను పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్ చేరు ఏరియా హాస్పిటల్ కి తరలించారు.
రచన రెడ్డి చేతికి కెనాన్ ఉండటం.. కారులో వైల్స్, సిరంజిలు ఉండటంతో.. పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి కింద కేసు నమోదు చేశారు. వైల్స్, సిరంజి లను ఎఫ్ ఎస్ ఎల్ కు పంపారు పోలీసులు. FSL రిపోర్ట్ వచ్చిన తర్వాతే.. ఎలాంటి ఇంజక్షన్ రచన తీసుకుంది అనేది నిర్ధారించగలమని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులను విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రచన రెడ్డి మృతి పై తమకు ఎలాంటి అనుమానాలు లేవని.. ఆత్మహత్య చేసుకుందని చెప్పారు రచన కుటుంబసభ్యులు. రచన కొంతకాలంగా ఒత్తిడికి లోనవుతోందని.. చాలాసార్లు సర్ధిచెప్పినా తీరు మారలేదని అంటున్నారు. తాను కూడా డాక్టర్ ను కావడంతో.. కౌన్సిలింగ్ కూడా ఇచ్చి చూశానని రచన అన్న మనోజ్ తెలిపాడు.
రచన కు పొసెసివ్నేస్ ఎక్కువ అని… తన మాటే నెగ్గాలి అనే మనస్థత్వం ఉంటుందని మనోజ్ తెలిపాడు. అందరూ తన మాటే వినాలని.. తాను చెప్పింది జరగాలని అనుకుంటుందన్నారు. తన మాటకు విలువ ఇవ్వకపోతే అస్సలు సహించలేదన్నారు. గతేడాది నవంబర్ లో రచనకు ఓ కార్డియాలజిస్ట్ తో పెళ్ళి సంబంధం సెట్ అయ్యింది. మార్చిలో ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకుందాం అనుకున్నారు. పెళ్లి చూపుల్లో చూసుకున్న ఇద్దరు.. మొబైల్ నెంబర్స్ ఎక్సేంజ్ చేసుకున్నారు. ఇద్దరూ డాక్టర్లు కావడంతో.. ఇద్దరూ ఎలాగో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కాబట్టి తరుచూ కాల్స్ మాట్లాడుకున్నారు.. నవంబర్ నుంచి జనవరి వరకు.. అంటే మూడు నెలల పాటు రెగ్యులర్ గా కాల్స్ మాట్లాడుకున్నారు. చాలా ప్రేమగా ఉన్నారు. అందమైన జీవితాన్ని ఊహించుకున్నారు. రచన కూడా ఎన్నో కలలుకందని తెలిపాడు.
రచన రెడ్డితో పెళ్ళి సెట్ అయిన డాక్టర్.. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో కార్డియాలజిస్ట్ గా చేరాడు. పని ఒత్తిడి పెరిగింది. దీంతో… రచన తో కాల్స్ మాట్లాడే టైం కేటాయించలేకపోయాడు. కొన్ని రోజులుగా కాల్స్ లేకపోవడంతో రచన ఎడబాటుగా ఫీల్ అయ్యింది. ఓ డాక్టర్ పరిస్థితిని మరో డాక్టర్ గా రచన అర్థం చేసుకోలేకపోయింది. ఇదే విషయం పలుమార్లు పేరెంట్స్ కి చెప్తూ.. బాధ పడినట్లుగా తెలుస్తోంది. వాళ్ళు ఎన్నోసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా .. డిప్రెషన్ లోనే ఉండేది. ముందు నుంచే పొసెసివ్నెస్ కోరుకునే రచన.. మరింత ఒత్తిడికి లోనైంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది. వృత్తి రీత్యా డాక్టర్ కావడంతో.. హానికర ఇంజెక్షన్ తీసుకుని సూసైడ్ చేసుకునేలా ప్లాన్ చేసుకుంది. నిన్న ఉదయం.. హాస్పిటల్ వెళ్తున్నాను అని ఇంట్లో నుంచి తన కారులో బయల్దేరింది రచన. ఔటర్ రింగ్ రోడ్డు మీదకు చేరుకుంది. అప్పుడు తన సూసైడ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. ఇంజక్షన్ తీసుకుంటే మజిల్ కి ఎక్కి.. లేట్ గా పనిచేస్తుంది అని.. చేతి మణికట్టు కు క్యాండిలా పెట్టుకుని.. అందులో అనస్థీషియా మందును అధిక మోతాదులో తీసుకుంది. నరాలకు ఎక్కి వెంటనే పనిచేసింది.. కారు డ్రైవ్ చేస్తున్న రచన కాన్షియస్ కోల్పోతూ వచ్చింది. కారు అదుపు తప్పుతూ వెళ్ళి.. orr రీలింగ్ ను ఢీ కొట్టింది. వెనక వైపు వస్తున్న వాహనదారులు గమనించి.. వెంటనే వెళ్ళి చూసారు. కారులో ఉన్న రచన అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రచన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే.. రచన ఎలాంటి ఇంజెక్షన్ తీసుకుంది అనే వివరాలు తెలుస్తాయని చెప్తున్నారు పోలీసులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




