‘ఒక బ్యారేజీ పిల్లర్లు కుంగితే ఇష్యూ చేస్తున్నారు’.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..

అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. సభలో ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా వ్యవహరించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదని.. మిగతా బ్యారేజీలనూ చూడాలని కోరారు.

'ఒక బ్యారేజీ పిల్లర్లు కుంగితే ఇష్యూ చేస్తున్నారు'.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
Harish Rao
Follow us

|

Updated on: Feb 13, 2024 | 11:39 AM

అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. సభలో ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా వ్యవహరించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదని.. మిగతా బ్యారేజీలనూ చూడాలని కోరారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టిఎంసీల ఉపయోగం… వీటన్నింటి సమాహారమే కాళేశ్వరం అని పేర్కొన్నారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్.. గత ప్రభుత్వం మీద బురద చల్లేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు హరీష్ రావు.

నాడు కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఎందుకని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టలేదో చెప్పాలన్నారు హరీష్ రావు. తాము నీళ్లు లేని ప్రాంతం నుంచి.. నీళ్లు ఉన్న దగ్గరకు మార్చి ప్రాజెక్టు కట్టి రైతులకు నీళ్లు అందించాం. రాష్ట్రంలో సుమారు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండిందంటే.. అది ఆ జలాల వల్లేనని గుర్తు చేశారు. తప్పు జరిగితే చర్య తీసుకోండి, పునరుద్దరణ పనులు చేయండి.. అంతేగానీ రైతులను ఇబ్బంది పెట్టకండి అని విజ్ఞప్తి చేశారు. ఒక బ్యారేజీ పిల్లర్లు కుంగితే ఇష్యూ చేస్తున్నారని.. కాంగ్రెస్‌ హయాంలో కూడా ఫ్లైఓవర్లు కూలిపోయాయి. దేవాదుల పంపులు ఆన్‌ చేయగానే పటాకుల్లా పేలిపోయాయి. పుట్టంగండి రిజర్వాయర్‌ ప్రారంభిస్తే, సాయంత్రానికే బంద్‌ చేశారని గుర్తు చేశారు హరీష్ రావు. కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు సరి చేయాలి కానీ రాజకీయం చేయొద్దన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రాజెక్టులను అప్పగిస్తున్నారంటూ తాము ఇవాళ సభ పెడితే.. దాన్ని డైవర్ట్ చేసేందుకు పోటీగా రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ సందర్శన కార్యక్రమాన్ని పెట్టిందని ధ్వజమెత్తారు హరీష్ రావు.

వీడియో: