హైదరాబాద్‌లో వాలంటైన్స్ డే ఈవెంట్స్, లవర్స్ కోసం రొమాంటిక్ డేట్స్, స్పాట్స్ ఇదిగో
ప్రేమికుల దినోత్సవం సమీపిస్తుండటంతో హైదరాబాద్ లోని పలు ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్రేమికుల కోసం రకరకాల థీమ్స్ ను, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇన్వైట్ చేస్తున్నారు. కేవలం ప్రేమికుల కోసమే హైదరాబాద్ లో రొమాంటిక్ డేట్స్ ను ఆఫర్స్ చేస్తున్నారు.

ప్రేమికుల దినోత్సవం సమీపిస్తుండటంతో హైదరాబాద్ లోని పలు ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్రేమికుల కోసం రకరకాల థీమ్స్ ను, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇన్వైట్ చేస్తున్నారు. కేవలం ప్రేమికుల కోసమే హైదరాబాద్ లో రొమాంటిక్ డేట్స్ ను ఆఫర్స్ చేస్తున్నారు. అవేంటో తెలుసుకొని ఈ లవర్స్ డేను మరిచిపోలేని రోజుగా మార్చుకోండి మరి.
మీరు మీ ప్రియురాలి, ప్రియుడితో కలిసి ఏడు అడుగులు వేయాలనుకుంటున్నారా.. అయితే ‘రోమియో అండ్ జూలియట్ పార్టీ’ కి వెళ్లి తీరాల్సిందే. క్లాసిక్ రొమాంటిక్ అనుభూతిని కోరుకునే వారి కోసం జూబ్లీ హిల్స్‌లోని లా కుపులా క్యాండిల్‌లైట్ డిన్నర్‌ని అందిస్తోంది. రాత్రి 7 గంటల నుండి ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు మొదలవుతాయి. జంటలు లైవ్ మ్యూజిక్, షాంపైన్, థీమ్ మాస్క్‌లు, టేబుల్ డెకర్ లాంటివి ఆస్వాదించవచ్చు. ప్యాకేజీ ధర జంటలకు రూ. 4,999. ఫిమేల్ స్టాగ్ టేబుల్స్‌కు రూ. 999 రేట్లు ఉన్నాయి.
కొన్ని జంటలకు నేచర్ అంటే చాలా ఇష్టం. అలాంటివాళ్ల కోసం కూడా ప్రత్యేక వర్క్ షాప్ ఉంది. లవ్‌బర్డ్‌లు తమ సృజనాత్మకతను బయటపెట్టవచ్చు. ఇష్టమైన భాగస్వామితో కలిసి మట్టి పరిమళాలను ఆస్వాదిస్తూ హాయిగా కుండలను తయారు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు కుండల వర్క్‌షాప్ కోసం ది హౌస్ ఆఫ్ గౌర్మెట్‌కి వెళ్లొచ్చు. ఒక్కో టిక్కెట్టు ధర రూ. 1,499 ఉంటుంది. జంటలు మట్టి వాతావరణంలో కబుర్లు చెప్పుకుంటూ కుండలు తయారు చేసుకోవచ్చు.
ప్రేమికుల రోజు అనగానే కొంతమంది ప్రేమికులు ఇష్టమైన సినిమాలు చూడాలనుకుంటారు. అలాంటివాళ్లు ఓపెన్ ఎయిర్ సినిమాకు వెళ్లొచ్చు. సన్‌సెట్ సినిమా క్లబ్, ది లాఫ్ట్‌తో కలిసి, స్టార్‌ల ఆధ్వర్యంలో ఐకానిక్ ఫిల్మ్ ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ని ప్రదర్శిస్తుంది. బీన్‌బ్యాగ్ సీటింగ్ మరియు సింగిల్స్‌కు రూ. 550 ధర ఉంది. నలుగురి బృందానికి రూ. 1,900 తో సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి మరి.
నోవోటెల్ హెచ్‌సిసి స్టార్స్ (నక్షత్రాలు) సెరినేడ్ వాలెంటైన్స్ డిన్నర్‌లో స్టార్‌ల క్రింద రొమాంటిక్ డిన్నర్ చేసే అవకాశం కల్పిస్తోంది. పూల్‌సైడ్‌లో, లాన్‌లో లేదా ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేసుకొని వైన్ తాగుతూ నక్షత్రాలను చూస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. వారికి మూడు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి, గ్రిల్ చేయడానికి పర్మిట్ ధర రూ. 12,390, లాన్ సిట్టింగ్ రూ. 14,750. పూల్‌సైడ్ టేబుల్ రూ. 17,700. అన్ని టేబుల్‌లలో లైవ్ మ్యూజిక్, ఫోటో బూత్ మరియు మాక్‌టెయిల్స్ బార్ ఉంటాయి.



