Hyderabad: స్క్రాప్ కొనుగోలు చేసేందుకు వెళ్లాడు.. బ్లాస్ట్‌లో దుర్మరణం.. అసలేమైందంటే..
హైదరాబాద్ సనత్‌నగర్‌లో పేలుడు కలకలం రేపింది. కెమికల్ స్ర్కాప్‌ను ఆటోలో లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో, ఒకరు స్పాట్ డెడ్ అయ్యాడు. పేలుడు ధాటికి అతని బాడీ చిధ్రమైంది.
హైదరాబాద్ సనత్‌నగర్‌లో పేలుడు కలకలం రేపింది. కెమికల్ స్ర్కాప్‌ను ఆటోలో లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో, ఒకరు స్పాట్ డెడ్ అయ్యాడు. పేలుడు ధాటికి అతని బాడీ చిధ్రమైంది. మూసాపేట్ హెచ్‌పీ రోడ్‌లోని గోదాములో స్క్రాప్ ను ఆటోలోకి ఎక్కిస్తుండగా ఓ కెమికల్ డబ్బా కిందపడటంతో ఈ పేలుడు జరిగినట్టు చెబుతున్నారు. మరణించిన వ్యక్తిని ముషీరాబాద్ బోలక్‌పూర్‌కి చెందిన మహ్మద్ నజీర్‌గా గుర్తించారు పోలీసులు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కెమికల్స్ డబ్బలను టాటా ఏస్ వాహనంలో లోడ్ చేస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే, మృతుడు నజీర్ తండ్రి ఇస్మాయిల్ స్క్రాప్ కొనుగోలు చేస్తుంటాడని.. అలా స్క్రాప్ కొనుగొలు చేసేందుకు వచ్చిన క్రమంలో ఈ ఘటన జరిగిందని సమాచారం. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సనత్‌నగర్ ఎస్‌ఐ చంద్రయ్య వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..