AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు మద్యం షాపులు బంద్..

Wine Shops: ఓవైపు హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి హైదరాబాదీలు సిద్ధం అవుతున్నారు. మరోవైపు మందుబాబులకు మాత్రం షాకింగ్ న్యూస్ అందింది. మద్యం షాపులను బంద్ చేయాలని రాంచకొండ పోలీసులు ప్రకటన జారీ చేశారు.

Hyderabad: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు మద్యం షాపులు బంద్..
Wine Shops Closed
Venkata Chari
|

Updated on: Mar 06, 2023 | 8:24 AM

Share

హోలీ పండుగ సెలబ్రేట్‌ చేసుకోవడానికి నగరవాసులు సిద్ధమవుతున్నారు. జంటనగరాల్లో హోలీ పండుగ జోష్‌ ఎంతలా సెలబ్రేట్ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, హోలీ సెలబ్రేషన్స్‌ను దృష్టిలో ఉంచుకొని పోలీసులు పటిష్ట చర్యలకు రెడీ అయ్యారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకూడదన్న ఉద్దేశంతో హైదరాబాద్‌లో వైన్స్‌ షాపులు బంద్ చేయాలని పోలీస్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో భాగంగానే మార్చిన 6న సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటలకు వరకు మద్యం షాపులను బంద్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ పేర్కొన్నారు. హోలీ పండుగని దృష్టిలో పెట్టుకుని వైన్స్​షాపులను క్లోజ్ చేయాలని సూచించారు. రూల్స్ అతిక్రమిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. అలాగే మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..