AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఈ రోజుల్లో నీటి సరఫరాకు అంతరాయం.. వివరాలివే..

సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి వద్ద కొత్త ట్రైన్ ట్రాక్‌ లైన్ నిర్మిస్తోంది. అయితే, ఈ నిర్మాణ పనులకు హైదరాబాద్‌కు మంచినీరు సరఫరా అయ్యే పైప్‌లైన్ అడ్డంకిగా మారింది. దాంతో ఈ పనులు పూర్తయ్యే వరకు నగరంలో చాలా ప్రాంతాల్లో మంచి నీటికి ఇబ్బందిగా మారొచ్చు..

Hyderabad: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఈ రోజుల్లో నీటి సరఫరాకు అంతరాయం.. వివరాలివే..
Drinking Water Supply Connection
Sanjay Kasula
|

Updated on: Mar 06, 2023 | 10:10 AM

Share

సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి వద్ద కొత్త ట్రైన్ ట్రాక్‌ లైన్ నిర్మిస్తోంది. అయితే, ఈ నిర్మాణ పనులకు హైదరాబాద్‌కు మంచినీరు సరఫరా అయ్యే పైప్‌లైన్ అడ్డంకిగా మారింది. దాంతో ఈ పనులు పూర్తయ్యే వరకు ఆ పైప్‌లైన్‌ను పక్కకు మార్చాల్సి వస్తోంది. ఈ కారణంగా హైదరాబాద్ పరిధిలోని చాలా ప్రాంతాలకు కొంతకాలం నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలోనే నగర ప్రజలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. రైల్వే లైన్‌ నిర్మాణ పనులకు ఆటంకం కలుగకుండా హైదరాబాద్‌కు మంచినీటిని సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1 లో కొండపాక నుంచి ఘన్‌పూర్‌కు ఉన్న 3,000 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైప్‌లైన్‌ను పక్కకు మార్చాల్సి వస్తోంది. మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ శుక్రవారం అర్థరాత్రి 12 గంటల వరకు మొత్తం 66 గంటల పాటు ఈ పనులు జరుగనున్నాయి. ఈ కారణంగా కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు.. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోనున్న ప్రాంతాలివే..

  1. ఓ అండ్ ఎం డివిజన్ నం.12 (కుత్బుల్లాపూర్) : షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం.
  2. ఓ అండ్ ఎం డివిజన్ నం.13 (మల్కాజ్ గిరి/అల్వాల్) : డిఫెన్స్ కాలనీ.
  3. ఓ అండ్ ఎం డివిజన్ నం. 19 : నాగారం/ దమ్మాయి గూడ, కీసర.
  4. ఓ అండ్ ఎం డివిజన్ నం. 24 (బొల్లారం) : రింగ్ మెయిన్-3 ఆన్ లైన్ సప్లై.
  5. ఓ అండ్ ఎం డివిజన్ నం. 25 (కొంపల్లి) : కొంపల్లి, గొండ్ల పోచంపల్లి ప్రాంతాలు.
  6. ఆర్ డబ్య్లూఎస్ ఆఫ్ టేక్ ప్రాంతాలు : కొండపాక (జనగామ, సిద్దిపేట), ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేర్ (భువనగిరి), ఘన్ పూర్ (మేడ్చల్/ శామీర్ పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు.
  7. ఓ అండ్ ఎం డివిజన్ నం. 14 (ఉప్పల్) : కాప్రా మున్సిపాలిటీ పరిధి ప్రాంతాలు.

పాక్షికంగా అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:

  1. ఓ అండ్ ఎం డివిజన్ నం. 6 (ఎస్. ఆర్. నగర్) : బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ.
  2. ఓ అండ్ ఎం డివిజన్ నం. 9 (కూకట్ పల్లి) : కేపీహెచ్ బీ, మల్యాసియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ ప్రాంతాలు.
  3. ఓ అండ్ ఎం డివిజన్ నం. 15 (శేరిలింగం పల్లి) : లింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు గల ప్రాంతాలు, గోపాల్ నగర్, మయూర్ నగర్, రిజర్వాయర్ ప్రాంతాలు.
  4. ఓ అండ్ ఎం డివిజన్ నం. 23 ( నిజాంపేట్) : ప్రగతి నగర్ ప్రాంతం, నిజాంపేట్/ బాచుపల్లి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..