Lionel Messi: హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీని మీటయ్యే చాన్స్.. ఎప్పుడు.. ఎలా అంటే..?
ప్రపంచ స్టార్ ఫుడ్‌బాల్ ప్లేయర్.. యావత్ ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను తన మాయాజాలంతో మంత్రముగ్ధులను చేసే లియోనెల్ మెస్సీని మీరు కలవాలనుకుంటున్నారా?.. అయిదే మీకు ఇదే మంచి ఛాన్స్.. ఎందకంటే ఆయన తర్వలోనే మన హైదరాబాద్ రాబోతున్నారు. ఇంతకు ఆయన్ను ఎలా, ఎక్కడ కలివాలో అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి.

యావత్ ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను తన మాయాజాలంతో మంత్రముగ్ధులను చేసే లియోనెల్ మెస్సీ.. త్వరలో హైదరాబాద్ రానున్నాడు. ఆయన “See you soon India!” అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే ఒక్క పోస్టు పెట్టగానే.. దేశంలోని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో నెట్టింట రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది నగరాల్లో అయితే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 2011 తర్వాత ఇండియాకు మెస్సీ రాబోతుండటం ఇదే మొదటి సారి.
మొదట్లో మెస్సీ ఇండియా టూర్‌ను కోల్‌కతా, ముంబై, ఢిల్లీ వరకే పరిమితం చేశారు. అయితే అభిమానుల డిమాండ్ నేపథ్యంలో.. ఆర్గనైజర్స్ షెడ్యూల్‌లో మార్పులు చేసి.. హైదరాబాద్‌ను ప్రత్యేకంగా టూర్‌లో చేర్చారు. ముందుగా అహ్మదాబాద్, కేరళలను పరిశీలించినా షెడ్యూల్ సమస్యలతో అది సాధ్యంకాలేదు. చివరకు హైదరాబాద్‌కు అదృష్టం కలిసొచ్చింది.
మెస్సీని కలవడం ఎలా..
హైదరాబాద్‌లో మెస్సీ ఈవెంట్‌కు టికెట్లు విడుదలయ్యాయి. బుకింగ్ ప్లాట్‌ఫామ్, District App ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు రూ. 1,250 నుంచి రూ.13,500 వరకు ఉన్నాయి. డిసెంబర్ 13, శనివారం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 7 గంటల నుంచి మెస్సీ సందడి చేయనున్నాడు. హైదరాబాద్‌లో జరిగే GOAT టూర్‌కు ప్రత్యేక కంటెంట్ సిద్ధమవుతోంది.
అభిమానుల కోసం మెస్సీ పాల్గొనే ప్రత్యేక ఎగ్జిబిషన్ మ్యాచ్, యువతకు ఫుట్‌బాల్ క్లినిక్, మ్యూజికల్ ట్రిబ్యూట్, మెస్సీకి ప్రత్యేక ఫెలిసిటేషన్ కార్యక్రమం, ఫ్యాన్ ఇంటరాక్షన్స్ వంటి ప్రొగ్రామ్స్ ఏర్పాటు చేశారు. మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఈవెంట్ కోసం ప్రభుత్వం చాలా ఖచ్చితమైన ప్లానింగ్ చేస్తోంది. టికెట్లు వేగంగా ఫిల్ అవుతున్నాయి. నిజమైన మెస్సీ అభిమానులైతే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి.
It’s official! Messi is coming to Hyderabad as part of the GOAT Tour, aimed at promoting football in India. The Hyderabad event will be held at 7 PM on December 13.Messi will be: 🔹Playing a 7 vs 7 celebrity match🔹Leading a masterclass with young scouted talents🔹Taking on… pic.twitter.com/qutr9wpso7
— Hyderabad Real Estate & Infra (@HydREGuide) November 10, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




