Rain Alert: వామ్మో.. దూసుకొస్తున్న మరో తుఫాన్.. తెలుగురాష్ట్రాలపై భారీ ఎఫెక్ట్!.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే
నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ, రాబోయే 3 గంటల్లో తుఫానుగా మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణలో రాబోయే మూడు రోజల పాటు వాతావరణాన్ని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్ర అంచనా వేసింది. కాబట్టి గురు, శుక్ర, శని వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం పదండి.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆగ్నేయ శ్రీలంక తీరం సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి బుధవారం రాత్రి 23:30 గంటలకు ఇంచుమించు అదే ప్రాంతంలో వాయుగుండం గా మారింది. తదుపరి ఈ వాయుగుండం ఉత్తర వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి ఈరోజు ఉదయం 05:30 గంటలకు అదే ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారింది. తర్వాత తీవ్ర వాయుగుండం పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 640 కి మీ, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 730 కి మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్రవాయుగుండం ఉత్తర వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి ఈ మధ్యాహ్నానికి తుఫాన్ గా మారే అవకాశం ఉంది. 48 గంటలలో ఈ తుఫాను ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, సమీపంలోని దక్షిణ ఆంధ్ర కోస్తా తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది.
ఈ తుఫాన్ రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరం మీదుగా ఉత్తర-ఉత్తర పశ్చిమ దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో పీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కరిసే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో శుక్రవారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు, ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఇక దక్షిణ కోస్తాంద్రా, రాయలసీమలో రాబోయే మూడు రోజలు.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం కోస్తాంద్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఇక శనివారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే గంటకు 40 -50 కీ.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో ఇలా..
ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని.. ఆదివారం మాత్రం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
