Telangana: కూల్ న్యూస్.. వచ్చే 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.!

తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతోంది. ఎండల తీవ్రత తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం 40 డిగ్రీలకు పడిపోయింది. దీనికి కారణంగా ఉపరితల ఆవర్తనమే అని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో..

Telangana: కూల్ న్యూస్.. వచ్చే 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.!
Rain Alert
Follow us

|

Updated on: May 15, 2024 | 10:06 AM

తెలంగాణలో వాతావరణం క్రమేపీ చల్లబడుతోంది. ఎండల తీవ్రత తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం 40 డిగ్రీలకు పడిపోయింది. దీనికి కారణంగా ఉపరితల ఆవర్తనమే అని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో అవర్తనం ఏర్పడిందని.. దీని కారణంగా రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నారు.

బుధవారం.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

గురువారం.. ఉరుములు, మెరుపులు, 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

అలాగే ఉరుములు, మెరుపులు, 30-40 కిమీ వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

శుక్రవారం.. ఉరుములు, మెరుపులు, 30-40 కిమీ వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్