CREATE Awards: నిర్మాణ రంగంలో మై హోమ్ గ్రూప్ సరికొత్త అధ్యాయం.. జూపల్లి రామేశ్వర్ రావును వరించిన మరో ప్రతిష్టాత్మక అవార్డు..
మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావును మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. తాజాగా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించింది తెలంగాణ క్రెడాయ్. అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమం హైదరాబాద్‌లోని..
సత్ సంకల్పానికి కృష్టి, పట్టుదల తోడు అయితే విజయ తీరాలకు చేరుస్తోంది. అందరూ బాగుండాలనే జగదైక కుటుంబ భావన జగజ్జేతగా నిలుపుతోంది. అందుకు నిదర్శనమే మై హోమ్. ఇంతింతై వటుడింతై అన్న్టట్టు ఎదిగిన మై హోమ్.. పదివేల కుటుంబాల గుండె చప్పుడు. నమ్మకం..నాణ్యత.. భవితపై సాధికారతకు భరోసానిచ్చిన డాక్టర్ జూపల్లి రామేశ్వరరావును లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించించి క్రెడాయ్. తాజాగా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించింది తెలంగాణ క్రెడాయ్. అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతోంది. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ రంగంలో ఇప్పటికే 35వసంతాలు పూర్తి చేసుకుని అప్రతిహాతంగా దూసుకెళ్తోంది. నిర్మాణ రంగంలో మరే సంస్థా పోటీకి కూడా రాలేనంత వేగంగా దూసుకెళ్తోంది. నాణ్యమైన సేవలతో, టైమ్‌లీ డెలివరీతో కస్టమర్ల విశ్వాసాన్ని సంపాదించుకుంది. అన్నింటికీ మించి విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ అభివృద్ధిలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంది మై హోమ్. అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ వినియోగిస్తూ, లగ్జరీతో పాటు, పర్యావరణ అనుకూల నిర్మాణాలను చేపడుతూ వస్తోంది మై హోమ్ సంస్థ. ఇంతటి సుదీర్ఘమైన ప్రస్థానంలో తనతో కలసి నడిచినవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావు.
మేక్ లివింగ్ బెటర్..
సామాన్యుల సొంతింటికలను సాకారం చేయాలన్న ఆలోచన 35 ఏళ్లు ముందుకు నడిపించింది. అదే ఆలోచన ఒక సంస్థను, ఒక వ్యవస్థను తీర్చిదిద్దింది. 10వేలకు పైగా కుటుంబాలకు నాణ్యమైన సొంతిళ్లను అందించింది. ఇచ్చినమాటకు కట్టుబడి.. అద్భుతమైన ఇళ్లను అందిస్తోంది. ఈ మాటలన్నీ కలిపితే- మై హోమ్.
అంతేందుకు.. మేక్ లివింగ్ బెటర్ అనే వాగ్దానంతో సక్సెస్‌ఫుల్‌గా 35 ఏళ్లనుంచి నిర్మాణరంగంలో సేవలు అందిస్తున్న సంస్థ- మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్. నాణ్యమైన కన్‌స్ట్రక్షన్‌కు మారుపేరుగా నిలుస్తోంది ఈ సంస్థ. మై హోమ్ అన్నపేరు భరోసాకు మారుపేరైంది. 1986లో డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు ప్రారంభించిన మై హో మ్ కన్‌స్ట్రక్షన్స్.. మహావృక్షంగా మారింది.
గత నెలలో కూడా ఆయన కీర్తి కిరీటంలో ఓ వజ్రం వచ్చి చేరింది. ఢిల్లీలో 5వ నేషనల్ మినరల్ &వెల్త్ &కాన్‌క్లేవ్ జరిగింది. గనులు, ఖనిజ రంగంలో అద్భుతమైన పని చేస్తున్న కంపెనీలను ఫైవ్‌స్టార్ రేటింగ్ అవార్డులతో సత్కరించారు. లీజుకు తీసుకున్న గనుల నిర్వహణలో దేశవ్యాప్తంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్న మై హోమ్ గ్రూప్ దేశంలోని అత్యున్నత సంస్థల్లో ఒకటిగా నిలిచింది. కేంద్ర గనులు, ఖనిజ వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేతుల మీదుగా మైహోమ్ సంస్థ ప్రమోటర్ రంజిత్ రావు ఈ అత్యున్నత అవార్డును అందుకున్నారు.
ఇవి కూడా చదవండి: Pralay Missile: చైనా గుండెల్లో వణుకుపుట్టిస్తున్న ప్రళయ్.. భారత క్షిపణి పరీక్ష విజయవంతం..