Crime News: పరిచయం పేరుతో సోషల్ మీడియాలో వల.. క్లోజ్ అయ్యాక, కోర్కెలు తీర్చాలంటూ వేధింపులు.. చివరికి..
ఇంటర్‌నెట్ కొందరికి సమాజాభివృద్ధికి ఉపయోగిస్తే, మరికొందరు పక్కదారి పట్టిస్తూ.. సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఒకడు ఏకంగా ఆన్‌లైన్ వేదికగా అమ్మాయిలను మోసం చేస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.
Hyderabad Cybercrime: ఇంటర్నెట్ కొందరికి సమాజాభివృద్ధికి ఉపయోగిస్తే, మరికొందరు పక్కదారి పట్టిస్తూ.. సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఒకడు ఏకంగా ఆన్‌లైన్ వేదికగా అమ్మాయిలను మోసం చేస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలకు వల. స్నేహం పేరుతో దగ్గరై, లోబర్చుకుని కామావాంఛ తీర్చుకుంటున్న కేటుగాడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుతో కామాంధుడి బండారం బయట పెట్టారు పోలీసులు. నిందితుడి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన పాలకుర్తి అజయ్ హైదరాబాద్‌లో మల్టీమీడియా చదువుకుంటున్నాడు. దిల్‌షుక్‌నగర్ ప్రాంతంలో నివాసముంటూ.. అందమైన అమ్మాయి ముఖచిత్రంతో నకిలీ ఇంస్టాగ్రామ్ క్రియేట్ చేశాడు. అమ్మాయిగా పరిచయం చేసుకుంటూ క్లోజ్ ఫ్రెండ్స్‌గా చాటింగ్ మొదలు పెట్టేవాడు. మెల్లగా స్నేహం పేరుతో దగ్గరై, ఫేక్ ఫోటోలు పంపుతూ.. అమ్మాయిలను తమ ఫోటోలను పంపించమని రిక్వెస్ట్ చేస్తాడు మోసగాడు. అమ్మాయి అనుకోని ఫోటోలు పంపించినవారిని మెల్లగా ముగ్గులోకి దింపుతాడు. అనంతరం బ్లాక్ మెయిల్ మొదలుపడతాడు. న్యూడ్ ఫోటోలు పంపించకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి స్నేహితులకు బంధువులకు సోషల్ మీడియా పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగేవాడు.
ఇలా న్యూడ్ ఫోటోలు పంపించడంతో అసలు స్వరూపం బయటపెట్టేవాడు. ఈ ఫోటోలను ఆసరగా చేసుకుని, తన కోరిక తీర్చాలని, లేదంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని లైంగిక వేధింపులకు దిగేవాడు. ఈ క్రమంలో ఎందరో అమ్మాయిలు ఈ కీచకుడి వలలో పడ్డారు. అయితే, 15 రోజుల క్రితం ఇలా మోసపోయిన ఒక అమ్మాయి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పక్కా సమాచారంతో అతగాడి ఆటకట్టించారు. బుధవారం అర్ధరాత్రి దిల్‌సుఖ్‌నగర్‌లో నిందితుడు అజయ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, పోలీసుల విచారణలో చాలా మంది బాధితులు ఉన్నారని నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మరి కొంతమంది అమ్మాయిలు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. ఇలాంటి మోసాల భారీగా పడకుండా అమ్మాయి జాగ్రత్త పడాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.