Kidnap Case: మామే నిందితుడు.. హైదరాబాద్‌లో కిడ్నాప్‌కు గురైన చిన్నారి ఆచూకీ లభ్యం.. అసలేమైందంటే..?
Hyderabad Kidnap Case: హైదరాబాద్ నగరంలోని గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల చిన్నారి కీర్తనను గురువారం మధ్యాహ్నం
Hyderabad Kidnap Case: హైదరాబాద్ నగరంలోని గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల చిన్నారి కీర్తనను గురువారం మధ్యాహ్నం దుండగుడు కిడ్నాప్ చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. చిన్నారి కీర్తన ఆచూకీని కనుగొన్నారు. జీడిమెట్లలో పాప ఆచూకీని కనుగొన్నారు. దీంతోపాటు పాపను కిడ్నప్ చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాపకు మామ వరసైన వ్యక్తే కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల సాయంతో వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తుండగా.. పాప దొరికింది అంటూ నిందితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పాపను రక్షించి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోపాలపురం పోలీసులు రెజిమెంటల్‌బజార్‌లోని నీలిమా కిరాణాస్టోర్ ప్రాంతంలో నివసించే శ్రీనివాస్, ఉమా దంపతులకు పాపను అప్పగించారు.
కాగా.. గురువారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కీర్తనను గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. దుండగుడు చిన్నారిని స్కూటీపై తీసుకెళ్లాడని స్థానికులు వెల్లడించడంతో.. పోలీసులు సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని ట్రేస్ చేశారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read: