LIC Policy: ఎల్‌ఐసీకి షాకిచ్చిన వినియోగదారుల ఫోరం.. బీమా క్లెయిమ్ తిరస్కరించడంతో రూ.15.5 లక్షల జరిమానా..!
LIC Policy: బీమా క్లెయిమ్ తిరస్కరించడంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కు షాకిచ్చింది వినియోగదారుల ఫోరం. సమాచారం వెల్లడించకపోవడాన్ని, తమ వాదనలను..
LIC Policy: బీమా క్లెయిమ్ తిరస్కరించడంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కు షాకిచ్చింది వినియోగదారుల ఫోరం. సమాచారం వెల్లడించకపోవడాన్ని, తమ వాదనలను తిరస్కరించినందుకు తన మైనర్ మనవరాళ్ల తరపున కేసు వేసిన ఫిర్యాదుదారుడికి రూ.15.5 లక్షలు చెల్లించాలని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం ఎల్‌ఐసీని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. రాములు అనే వృద్ధుడు తన మైనర్ మనవరాళ్ల తరపున బీమా క్లెయిమ్ తిరస్కరణకు సంబంధించి ఎల్‌ఐసీ వ్యతిరేకంగా గతంలో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించిన తీర్పున వినియోగదారుల ఫోరం జూలై 25వ తేదీన వెల్లడించింది. క్లెయిమ్‌ను తిరస్కరణకు సంబంధించి సరైన సమాచారాన్ని వెల్లడించకుండా వారి వాదనను తిరస్కరించినందుకు ఫిర్యాదుదారుడికి రూ.15.5 లక్షలు చెల్లించాలని ఎల్‌ఐసీని జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశించింది.
తన కుమారుడు జీవన్ ఆనంద్ కింద రూ.5 లక్షల బీమా కవరేజీ, న్యూ బీమా గోల్డ్ కింద రూ.10 లక్షల బీమా కవరేజీపాలసీని 2012లో తీసుకున్నట్లు రాములు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే తన కుమారుడి మరణం తర్వాత మైనర్ మనవరాళ్ల తరపున వారి తాత రాములు జూలై 6, 2012న ఎల్‌ఐసీకి క్లెయిమ్‌ను సమర్పించాడు. మృతుడు తన ఆరోగ్యానికి సంబంధించిన సరైన సమాచారం వెల్లడించకపోవడం, అలాగే ప్రస్తుతం పాలసీని తీసుకునేటప్పుడు తన మునుపటి పాలసీల గురించి తెలపడంలో విఫలమయ్యాడు. ఈ కారణంగా బీమా క్లెయిమ్‌ను తిరస్కరించింది.
అయితే ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. మరణించిన వ్యక్తి పాలసీలో కేవలం ఒక విషయం గురించి మాత్రమే ప్రకటించలేదని బెంచ్ తెలిపింది. జూన్ 13,2012 నాటి డిశ్చార్జ్ సారాంశం ప్రకారం.. బీమా చేసిన వ్యక్తి గత ఆరు నెలలుగా దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడని, అయితే ఈ పాలసీని జూలై 27,2011న తీసుకున్నట్లు కోర్టు గుర్తించింది. ఫిర్యాదుదారుడు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను అణచివేస్తున్నట్లు రికార్డులో ఏమి లేదు అని బెంచ్ పేర్కొంది. జిల్లా వినియోగదారుల ఫోరం 9 శాతం వడ్డీతో పాటు బీమా మొత్తాన్ని చెల్లించాలని ఎల్ఐసీని ఆదేశించింది. అలాగే పరిహారంతో పాటు ఫిర్యాదుదారుడికి కోర్టు ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని కూడా పేర్కొంది.