Telangana: తెలంగాణ వ్యాప్తంగా జోరందుకున్న వ్యవసాయ పనులు.. కలకత్తా నుంచి ప్రత్యేకంగా వస్తున్న కూలీలు..
Telangana: తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వరినాట్లు పూర్తయ్యాయి.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో వరినాట్లు వేస్తున్నారు. అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు రైతులకు పెద్ద ఇబ్బందే వచ్చి పడింది. వరినాట్ల కోసం రైతులకు కూలీల కొరత ఏర్పడింది. కూలీల కొరత వారిని తీవ్రంగా వేధిస్తోంది. దాంతో పలువురు రైతులు తమ పొలాల్లో నాట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి రప్పించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ పలు ప్రాంతాల్లో వరి నాట్లు వేసేందుకు ప్రత్యేకంగా కలకత్తా నుంచి కూలీలను దిగుమతి చేసుకుంటున్నారు. పది మంది చొప్పున మగవారు బృందాలుగా ఏర్పడి ఎకరాకు ఇంత అని గుత్తా మాట్లాడుకుంటున్నారు. ఆ మేరకు వరినాట్లు వేస్తున్నారు. కాగా, ఇతర ప్రాంతాలను తీసుకువచ్చిన రైతులకు.. ఎకరాకు రూ. 5,500 చొప్పున రైతులు చెల్లిస్తున్నారు. కాగా, పది మంది బృందం కూలీలు ఒక్క రోజులో మూడెకరాల వరకు నాట్లు వేస్తున్నారు.
కాగా, స్థానికంగా ఉన్న కూలీలకు కూలీ రేట్లు అధికంగా ఉండటంతో రైతులంతా బయటి నుంచి తీసుకువచ్చేందుకే మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా స్థానికంగా ఒక మగ మనిషికి ఒక రోజు కూలీ కింద వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు ఇస్తుండగా.. ఆడవారికి ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ఇస్తున్నారు. పైగా పని కూడా సాగడం లేదని రైతులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికుల కంటే.. ఇతర ప్రాంతాల వారే బెటర్ భావిస్తున్న రైతులు.. ఇతర ప్రాంతాల నుంచి కూలీలకు తీసుకువస్తున్నారు. అంతేకాదు.. కలకత్తా నుంచి వస్తున్న మగవారి బృందం నాట్లు నిటారుగా నిలబడేటట్లు వేయడంతో దిగుబడి అధికంగా వస్తుందనే నమ్మకం కూడా రైతులలో ఏర్పడింది. అన్నింటినీ బేరీజు వేసుకుంటున్న రైతులు.. ఈ కలకత్తా బృందాలే బెటర్ అని భావిస్తున్నారు.
Also read: