Viral Video: పోట్లాడుకున్న సింహాలు.. అదే ఛాన్స్‌గా జంప్ అయిన గేదె.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Viral Video: అడవికి రాజు సింహం. ఆ సింహం వేటాడితే మామూలుగా ఉండదు. అవతల ఏ జంతువైనా సరే ఆహారంగా మారాల్సిందే.
Viral Video: అడవికి రాజు సింహం. ఆ సింహం వేటాడితే మామూలుగా ఉండదు. అవతల ఏ జంతువైనా సరే ఆహారంగా మారాల్సిందే. అయితే, ఈ సింహాలు గానీ, చిరుత పులులు గానీ.. ఎప్పుడు పడితే అప్పుడు వేట సాగించవు. వాటికి బాగా ఆకలి అనిపించినప్పుడు మాత్రమే ఇతర జంతువులను ఇవి వేటాడుతాయి. అయితే, వీటి వేట మామూలుగా ఉండదు. వైల్డ్‌గా, చాలా తెలివిగా వేటాడుతాయి. ఇతర జంతువులకు ఏమాత్రం అనుమానం రాకుండా నక్కి నక్కి అదును చూసి మీదకు దూకుతాయి. అంతేస్థాయిలో పరుగెత్తి మరీ వాటిని వేటాడుతాయి. సింహం, చిరుత పులుల వేటకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియో చూస్తే మాత్రం ఫుల్లుగా నవ్వుకుంటారు. ఎందుకంటే.. ఒక రొట్టే ముక్క కోసం రెండు పిల్లులు కొట్టుకుంటుంటే.. మధ్యలో కొతి వచ్చి మొత్తం తినేసిందన్న చందంగా ఇక్కడ సింహాల పరిస్థితి మారింది. అయితే, వేరే జంతువేదీ లాభపడకపోయినప్పటి.. చిక్కినట్లే చిక్కిన ఎర కాస్తా ప్రాణాలతో బతుకు జీవుడా అంటూ ఉడాయించింది.
అసలేం జరిగిందంటే.. ఈ వీడియోలో నాలుగు సింహాల మంద ఓ గేదెను వేటాడాయి. అయితే, ఆ గేదెను పట్టుకున్న సింహాలు ఉన్నట్లుండి కొట్టుకోవడం మొదలు పెట్టాయి. తొలుత ఓ సింహం ఆ గేదెను తినేందుకు ప్రయత్నించింది. అంతలో మరో సింహం కూడా తినేందుకు ప్రయత్నించగా.. దానిని అడ్డుకుంది. ఇలా ఒకదానికి మరొకటి అడ్డుకుంటూ పరస్పరం పోట్లాడుకున్నాయి. అయితే, ప్రాణాలతోనే ఉన్న ఆ గేదె.. ఇదే అదునుగా భావించి పరుగు లంకించింది. సింహాల చెర నుంచి తప్పించుకుని పారిపోయింది. సింహాలు మాత్రం ఒకదానిపై మరొకటి పడుతూ పోట్లాడుకున్నాయి.
ఈ షాకింగ్ వీడియో లైఫ్ అండ్ నేచర్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోను చూసి నవ్వుకుంటున్నారు. సింహాల ఫైటింగ్.. గేదెకు ఉపకరించిందంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై చాలా మంది రీట్వీట్ చేస్తుండటంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ థ్రిల్లింగ్ వీడియోను మీరూ చూసేయండి మరి.
Viral Video:
No comment, but the buffalo ran away. pic.twitter.com/jJHVBemSKg
— Life and nature (@afaf66551) July 25, 2021
Also read:
Vijayawada News: పై నుంచి దిగొచ్చిన దొంగలు.. చూస్తుండనే నాలుగు షాపుల్లో భారీ చోరీకి పాల్పడ్డారు..
Telangana Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..