Viral Video: మురికినీటితో ప్లేట్‌లను కడుగుతున్న వ్యాపారి.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Jul 26, 2021 | 10:38 PM

మొన్నీమధ్య ఉమ్మి వేసి పరోటాలను చేస్తోన్న వీడియో ఒకటి వైరల్ కాగా, అంతకముందు పానీపూరిల్లో మురికి నీరును ఉపయోగిస్తూ...

Viral Video: మురికినీటితో ప్లేట్‌లను కడుగుతున్న వ్యాపారి.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!
Washing Plates

Follow us on

మొన్నీమధ్య ఉమ్మి వేసి పరోటాలను చేస్తోన్న వీడియో ఒకటి వైరల్ కాగా, అంతకముందు పానీపూరిల్లో మురికి నీరును ఉపయోగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేసింది. ఇప్పుడు అలాంటిదే ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో పాతదే అయినా మరోసారి నెట్టింట హల్చల్ చేస్తోంది. దానిని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇలాంటి కరోనా టైంలో అతగాడు చేసే పనికి మీరేమంటారో.?

అపరిశుభ్రమైన వాతావరణం వ్యాధిని మరింతగా వ్యాప్తి చేస్తుందని వైద్యులు అంటుంటారు. అందుకే పరిసరాలను ఎలప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతారు. అయితే ఇక్కడ ఈ వీడియోలోని వ్యక్తి ప్లేట్‌లను మురికినీటితో శుభ్రపరుస్తూ.. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత రోడ్డు పక్కన బండ్ల మీద ఫుడ్‌ను తినాలనుకునేవారు ఖచ్చితంగా ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు. కాగా, ఈ వీడియోను ‘జట్వాడి.స్టైల్’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. తక్కువ వ్యవధిలో వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా ఈ వీడియోను లక్షా 50 వేల మంది వీక్షించారు. కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

View this post on Instagram

A post shared by ⚡ JATTWADI STYLE ⚡ (@jattwadi.style)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu