Income Tax Department: ఈ నగదు లావాదేవీలు జరిపినట్లయితే ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయ్‌.. జాగ్రత్త..!

Income Tax Department: ప్రజల నగదు లావాదేవీలను తగ్గించడానికి ఆదాయపు పన్ను శాఖ, బ్యాంకు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, బ్రోకరేజీలు లాంటి వివిధ పెట్టుబడికి సంబంధించిన..

Income Tax Department: ఈ నగదు లావాదేవీలు జరిపినట్లయితే ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయ్‌.. జాగ్రత్త..!
Follow us
Subhash Goud

| Edited By: Phani CH

Updated on: Jul 26, 2021 | 7:52 AM

Income Tax Department: ప్రజల నగదు లావాదేవీలను తగ్గించడానికి ఆదాయపు పన్ను శాఖ, బ్యాంకు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, బ్రోకరేజీలు లాంటి వివిధ పెట్టుబడికి సంబంధించిన ప్లాట్‌ఫామ్‌లు నిబంధనలు కఠినతరం చేశాయి. నగదు లావాదేవీలకు పరిమితులు విధించాయి. ఈ నిబంధ‌న‌లు ఉల్లంఘించినట్లయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. అయితే నోటీసులు పంపే అవకాశం ఉన్న ఐదు నగదు లావాదేవీలు ఇవే.

సేవింగ్‌, కరెంట్‌ అకౌంట్‌:

ఒక వ్యక్తి సేవింగ్‌ అకౌంట్‌లో నగదు డిపాజిట్‌ పరిమితి లక్ష రూపాయలు. సేవింగ్‌ ఖాతాలో లక్ష రూపాయలకు మించి డిపాజిట్‌ చేసినట్లయితే అదాయపు పన్ను నోటీసులు పంపే అవకాశం ఉంది. అదే విధంగా కరెంటు అకౌంట్‌లకు, పరిమితి రూ.50 లక్షలు. ఈ పరిమితిని ఉల్లంఘించినట్లయితే ఆదాయపు పన్ను శాఖ పంపే నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD):

చిన్న పెట్టుబడి స్కీమ్‌లలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అనేది ఓ మంచి అవకాశం అనే చెప్పాలి. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో నగదు డిపాజిట్‌ రూ.10 లక్షలకు మించకూడదు. బ్యాంకు డిపాజిటర్‌ ఒకరి బ్యాంకు ఎఫ్‌డీ ఖాతాలో అంతకు మించి నగదు డిపాజిట్‌ చేయకూడదు.

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల విషయంలో..

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపు విషయంలో లక్ష రూపాయల పరిమితిని మించకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో ఈ నగదు పరిమితిని ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపే అవకాశం ఉంటుంది. అందుకు సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది.

మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌ మార్కెట్‌, బాండ్‌..

మ్యూచువల్‌ ఫండ్స్‌, స్టాక్స్‌, బాండ్‌, డిబెంచర్లలో పెట్టుబడులు పెట్టే వారు నగదు పెట్టుబడిగా 10 లక్షల రూపాయల పరిమితి మించకుండా చూసుకోవాలి. ఈ నగదు పరిమితి మించితే ఆదాయపు పన్ను శాఖ, మీ చివరి ఆదాయపు పన్ను రిటర్న్‌ను తనిఖీ చేస్తుంది.

రియల్‌ ఎస్టేట్‌:

ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రమించేటప్పుడు, రియల్‌ ఎస్టేట్‌ ఒప్పందంలో రూ.30 లక్షలు పరిమితికి మించి నగదు లావాదేవీలు ఉంటే ఆదాయపు పన్ను శాఖకు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. అంత‌కు మించి న‌గ‌దు లావాదేవీలు చేయ‌డాన్ని ఐటీ శాఖ ప్రోత్సహించదు. కాగా,ఈ ఐటీ శాఖ నిబంధనల నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆదాయపు పన్ను శాఖ ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పరిమితికి మించి చేసే లావాదేవీల వివ‌రాలు సుల‌భంగా తెలిసిపోతాయి.

ఇవీ కూడా చదవండి

Personal Loan Limit: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వ్యక్తిగత రుణాల పరిమితిని పెంచుతూ ప్రకటన.. కానీ వారికి మాత్రమే..!

Postal Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఈ పథకంలో చేరితే ఏడాదికి రూ.59,400.. ఎలాగంటే..!