AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Lawyer Murder: పట్టపగలు హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య..!

హైదరాబాద్‌ మహా నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఓ వ్యక్తిని పాత కక్షల నేపథ్యంతో దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే సోమవారం ఉదయం పట్టపగలు మరో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా ఓ లాయర్‌ దారుణ హత్యకు గురయ్యాడు..

Hyderabad Lawyer Murder: పట్టపగలు హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య..!
Hyderabad Lawyer Murder Case
Srilakshmi C
|

Updated on: Mar 24, 2025 | 1:16 PM

Share

హైదరాబాద్‌, మార్చి 24: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఓ వ్యక్తిని పాత కక్షల నేపథ్యంతో దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే సోమవారం ఉదయం పట్టపగలు మరో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా ఓ లాయర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకెళ్తే..

చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్‌లో సోమవారం ఉదయం ఓ లాయర్‌ దారణహత్యకు గురయ్యాడు. అంబేద్కర్‌వాడలో న్యాయవాది ఇజ్రాయెల్‌ను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. తీవ్రగాయాల పాలైన అతడిని వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ లాయర్‌ ఇజ్రాయెల్‌ మృతి చెందాడు. అసలేం జరిగిందంటే..

అడ్వకేట్‌ ఇజ్రాయెల్‌ ఇంట్లో ఓ మహిళ కిరాయికి ఉంటున్నది. ఆమెను దస్తగిరి అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ గతకొంతకాలంగా వేధిస్తున్నాడని ఇజ్రాయెల్‌ను ఆశ్రయించింది. దీంతో బాధితురాలి తరఫున ఇజ్రాయెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న దస్తగిరి లాయర్‌ ఇజ్రాయెల్‌పై కక్షపెంచుకున్నాడు. నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా? అంటూ దస్తగిరి ఈ రోజు ఉదయం అడ్వకేట్‌పై దాడిచేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదుచేసి నిందితుడిన అదుపులోకి తీసుకున్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఈ దారుణం చోటు చేసుకోవడంతో స్థానికులు భయంతో హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!