AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడాదిన్నరలో 5 సార్లు బదిలీ.. తహసీల్దార్‌కు గుండెపోటు! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల క్రితం తహసీల్దార్ల బదిలీల జాబితా వెలువడింది. ఇందులో బాన్సువాడ ఆర్టీవో కార్యాలయంలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి పేరు కూడా ఉంది. ఏడాదిన్నర కాలంలో ఇప్పటికే నాలుగు సార్లు ట్రాన్స్‌ఫర్‌ అవగా.. తాజాగా ఐదోసారి బదిలీ అర్డర్‌ చేతికందింది. అప్పటికే విసిగెత్తిపోయిన ఆయన తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు..

ఏడాదిన్నరలో 5 సార్లు బదిలీ.. తహసీల్దార్‌కు గుండెపోటు! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Tehsildar Dies Of Heart Attack
Srilakshmi C
|

Updated on: Mar 24, 2025 | 12:44 PM

Share

బాన్సువాడ, మార్చి 24: ఆయనో నిజాయితీ పరుడైన ప్రభుత్వ అధికారి. భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగి. దంపతులిద్దరూ ఒకేచోట పనిచేసే అవకాశం ఉన్నా ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఏడాదిన్నర కాలంలో వరుసగా ఐదు సార్లు బదిలీ చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన గుండెపోటుతో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ ప్రభుత్వాధికారికి జరిగిన అన్యాయం ఇది. తోటి ఉద్యోగులు తెలిపిన ప్రకారం..

నాలుగు రోజుల క్రితం తహసీల్దార్ల బదిలీల జాబితా వెలువడింది. ఇందులో బాన్సువాడ ఆర్టీవో కార్యాలయంలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న విజయ్‌కుమార్‌ (59)ని ఎల్లారెడ్డి ఆర్డీవో ఆఫీస్‌కు బదిలీ చేశారు. సర్కార్‌ ఉత్తర్వుల మేరకు ఆయన ఈ నెల 24న విధుల్లో చేరాల్సి ఉంది. అయితే మార్చి 22న అర్ధరాత్రి విజయ్‌ కుమార్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన ఆదే రోజు మృతి చెందారు. విజయ్‌కుమార్‌ స్వగ్రామం ఆర్మూర్‌. ఆయన భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వీరి దంపతులకు ఇద్దరు కూతుళ్లు.

భార్యాభర్తలు ఒకే దగ్గర పనిచేసేందుకు అవకాశమున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఏడాదిన్నరలో ఐదుసార్లు బదిలీ చేశారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా నిర్మల్‌ జిల్లాకు బదిలీ చేశారు. ఆ తర్వాత మళ్లీ నిబంధనలకు విరుద్ధంగా ఆదిలాబాద్‌ జిల్లాలో పోస్టింగ్‌ ఇచ్చారు. స్పౌస్‌ కోటాలో నిజామాబాద్‌కు బదిలీకి ప్రయత్నం చేయగా అతడి విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోకుండా కామారెడ్డికి బదిలీ చేశారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కామారెడ్డి జిల్లాలో మరో మూడు సార్లు బదిలీ చేశారు. ఇలా తరచూ బదిలీలతో విసిగెత్తి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన విజయ్‌ కుమార్‌కు తాజాగా గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం అర్ధరాత్రి మృతి చెందారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..