AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor: ఇతర రాష్ట్రాల మద్యం వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టమో తెల్సా.? లెక్కలు చూస్తే..

తెలంగాణ ఎక్సైజ్ శాఖకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తో భారీగా ఖజానాకు గండి పడుతోంది. దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఎన్డిపిల్ లిక్కర్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ వందలకొద్ది మద్యం బాటిల్లను సీజ్ చేశారు. గాడి తప్పుతున్న ఆదాయాన్ని అదుపులో పెట్టేందుకు ఎక్సైజ్ శాఖ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తుంది. విదేశీ,ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లను సీజ్ చేస్తుంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్.

Liquor: ఇతర రాష్ట్రాల మద్యం వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టమో తెల్సా.? లెక్కలు చూస్తే..
Liquor
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jun 18, 2025 | 9:19 AM

Share

తెలంగాణలోకి వస్తున్న నాన్ డ్యూటీ పే లిక్కర్‌పై గత వారం రోజులుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ వందల సంఖ్యలో మద్యం బాటిలను సీజ్ చేసింది. ఈ నెల మూడు నుంచి తొమ్మిదవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో 25 లక్షల విలువైన లిక్కర్, బీర్, దేశిదారు మద్యాన్ని ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. ఈ దాడుల్లో ఎస్టిఎఫ్ టీంతో పాటు ఏసీ ఎన్ఫోర్స్మెంట్, డిటీఎఫ్ టీంలు ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొని 64 కేసులు నమోదు చేశారు. అయితే వివిధ కేసుల్లో 33 మందిని అరెస్ట్ చేసి 19 వాహనాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో 1188 మద్యం బాటిళ్లు, 22 లీటర్ల బీరు బాటిల్స్, 21 లీటర్ల దేశిదారు మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. రాష్ట్రంలో మధ్యాన్ని సేవించకుండా ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు మద్యం తీసుకొచ్చి తెలంగాణలో అమ్ముతుండడంతో రాష్ట్ర ఖజనాకు భారీగా గండి పడుతుంది. దీంతో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఎన్డిపిఎల్ లిక్కర్ సప్లై చేసే వారిపై ఉక్కు పాదం అవుతుంది. తెలంగాణ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కసిం ఆదేశాల మేరకు ఢిల్లీ గోవా లాంటి రాష్ట్రాల నుంచి వచ్చే ప్రత్యేక రైళ్లపై ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ టీం దృష్టితరించి తనిఖీ నిర్వహించి మద్యం బాటిలను పట్టుకున్నారు.

ఇలా రైల్వేస్టేషన్లో పట్టుకున్న మద్యం బాటీలకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అనుమానం వచ్చిన వారి బ్యాగులను తనిఖీ చేయగా 40 మద్యం బాటిలను పట్టుకున్నారు. గోవా నుండి వాస్కోడిగామా రైలును ఎస్టిఎఫ్ టీం తో పాటు వికారాబాద్ చెందిన ఎక్సైజ్ డిటిఎఫ్ పోలీసులు తనిఖీ నిర్వహించగా భారీ ఎత్తున నాన్ డ్యూటీ పై లిక్కర్ని పట్టుకున్నారు. ఏసీ రంగారెడ్డి శంషాబాద్ డిటిఎఫ్ జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో ఎన్డిపిఎల్ మద్యం పట్టుబడింది గోవా ప్రాంతాల నుంచి డిమాండ్ చేసుకుని మద్యంతో పాటు డిఫెన్స్ మద్యం బాటిల్ సైతం పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. శంషాబాద్ సరూర్నగర్ మల్కాజ్గిరి వికారాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ సంగారెడ్డి మెదక్ వరంగల్ అర్బన్ కరీంనగర్లో ఎక్సైజ్ దాడి నిర్వహించి విదేశీ, ఇతర రాష్ట్రాల లిక్కర్ ని పట్టుకున్నారు.

ఇటు తెలంగాణ బార్డర్ ఆదిలాబాద్, నిర్మల్, కోమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో దేశీదారు మద్యాన్ని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి విక్రయాలు చేస్తుండగా పట్టుకున్నారు. తనిఖీలకు సంబంధించి ఇదే తీరును కొనసాగించాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కాసిం సిబ్బందిని ఆదేశించారు. ఎన్డిపిఎల్ లిక్కర్ పై వరుసగా అధికారులతో రివ్యూ నిర్వహించి ఎక్సైజ్ ఉన్నత అధికారులు కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. వారం రోజుల్లో ఎస్టిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిటిఎఫ్ టీమ్లతో పాటు ఎక్సైజ్ యంత్రాంగం చేపట్టిన దాడులు ఫలితాలు ఇచ్చాయని సమావేశంలో డైరెక్టర్ షాన్వాజ్ కాసిం అన్నారు. ఇదే తీరును ఎక్సైజ్ శాఖలోని అన్ని టీములు నిరంతరం దాడులు నిర్వహిస్తే ఎన్డిపిల్ లిక్కర్ ని కంట్రోల్ చేసి రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచే అవకాశం ఉంటుంది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ని వినియోగదారులు ఎవరు వినియోగించవద్దని ఎక్సైజ్ శాఖ సైతం కోరుతుంది.