AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Musi Politics: మూసీ యుద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన కిషన్ రెడ్డి.. ప్లాన్ మామూలుగా లేదుగా..

తెలంగాణలో మూసీ కోసం యుద్ధం మరో లెవల్‌కు వెళ్లింది. కాషాయసేన కదం తొక్కుతోంది. సర్కార్‌కు ఛాలెంజ్‌ విసురుతోంది. మూసీ పునరుజ్జీవం అని ప్రభుత్వం అని ప్రభుత్వం అంటుంటే, ఆ పేరుతో ఇళ్లు కూల్చొద్దని బీజేపీ అంటోంది. ఈ క్రమంలో బీజేపీ ఇవాళ కొత్త కార్యాచరణ ప్రకటించింది.

Musi Politics: మూసీ యుద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరించిన కిషన్ రెడ్డి.. ప్లాన్ మామూలుగా లేదుగా..
Revanth Reddy - Kishan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Nov 16, 2024 | 9:54 AM

Share

తెలంగాణ రాజకీయాల్లో మూసీ యుద్ధం మరో లెవల్‌కు వెళ్లింది. సియోల్‌ తరహాలో హైదరాబాద్‌లో మూసీని పునరుజ్జీవింపజేస్తామంటూ తెలంగాణ లోని రేవంత్ సర్కార్ చెబుతోంది.. ఇందుకోసం ఆయన ఈనెల ఎనిమిదో తేదీన నల్గొండ జిల్లాలోని మూసీ నదీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేశారు. మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడితే బుల్జోజర్లతో తొక్కిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. రేవంత్‌ కామెంట్స్‌కు బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. మూసి ప్రాంతం పేదలకు మనోధైర్యం కల్పిందేందుకు, వారికి అండగా ఉంటానని కిషన్ రెడ్డి ఘాటుగా రియాక్షన్ అయ్యారు.. సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టిన కిషన్ రెడ్డి.. బుల్డోజర్లు వస్తే చావడానికైనా సిద్ధమేనని చెప్పారు. ఈ క్రమంలోనే.. మొన్న రేవంత్‌ పాదయాత్ర చేస్తే, ఇవాళ మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర చేపడుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకించారు. తాము ఉన్నామంటూ ప్రజల తరపున కాషాయ నేతలు గళం విప్పారు. పేదల ఇళ్లు కూల్చొద్దని డిమాండ్ చేస్తున్న బీజేపీ .. మూసీ పునరుజ్జీవంపై సమగ్ర నివేదికకు పట్టు బడుతోంది..

సీఎం రేవంత్ ఛాలెంజ్.. కిషన్ రెడ్డి రియాక్షన్..

అయితే.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సమయంలో.. మూసి వద్దా నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. దానికి తగినట్లుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు రాత్రి అంబర్పేట్ తులసి రామ్ నగర్ మూసి పేదల నివాసం ప్రాంతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా.. ముఖ్యనేతలు బస్తీ నిద్ర చేయనున్నారు. కిషన్ రెడ్డితో పాటు, బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, లక్ష్మణ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇతర నేతలు మూసి ఏరియాలోని 20 ప్రాంతాల్లో రాత్రి బస చేయనున్నారు.. శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు బీజేపీ నేతలు ఆయా ప్రాంతాల్లో రాత్రి బస చేయనున్నారు.

తులసీరామ్‌నగర్‌లో కిషన్ రెడ్డి బస్తీనిద్ర చేయనుండగా.. మలక్‌పేట శాలివాహననగర్‌లో లక్ష్మణ్‌, ఎల్బీనగర్‌ ద్వారకాపురంలో ఈటల బస్తీ నిద్ర చేయనున్నారు.

అటు బీఆర్‌ఎస్‌ నేతలు కూడా మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు మద్దతు పలికారు. ఇటు బీజేపీ కూడా బస్తీ నిద్రకు రెడీ అయింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ నేతలు ఇచ్చే కౌంటర్లు ఏంటి? మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటి? మూసీ యుద్ధంలో పొలిటికల్‌ హీట్‌ పెరిగిన నేపథ్యంలో ఏం జరగబోతోంది అన్నది కీలకంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..